దోమలు కుట్టడానికి కారణాలివే...
దోమలు కనిపించని ప్రాంతం ఏదీ లేదు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉంటుంది. దీంతో దోమలు పదేపదే కుడుతుంటాయి. అసలు ఈ దోమలు ఎందుకు కుడుతాయో ఓ సారి పరిశీలిద్ధాం.
దోమలు కనిపించని ప్రాంతం ఏదీ లేదు. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉంటుంది. దీంతో దోమలు పదేపదే కుడుతుంటాయి. అసలు ఈ దోమలు ఎందుకు కుడుతాయో ఓ సారి పరిశీలిద్ధాం.
చర్మం నుంచి వెలువడే రసాయనాలు, చర్మంపై ఉండే బ్యాక్టీరియాకు దోమలను విపరీతంగా ఆకర్షితులవుతాయి. ప్రధానంగా ఆడదోమలు కార్బన్‌డయాక్సైడ్ ఉండే వాతావరణాన్నే ఇష్టపడతాయని ఓ సర్వే ద్వారా తెలిసింది. ముఖ్యంగా గర్భిణులను దోమలు కుట్టడానికి ఇష్టపడతాయట. సాధారణ మహిళల కంటే గర్భిణులు (28 వారాల సమయంలో) విడిచే శ్వాసలో 21 శాతం కంటే ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్ ఉంటుంది. అందుకే దోమలు గర్భిణుల్ని కుడతాయని కార్నెల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ లారా చెబుతున్నాడు.
శారీరకంగా కష్టపడినపుడు లాక్టిక్‌ఆమ్లం, యూరిక్ ఆమ్లం, అమ్మోనియా వంటి రసాయనాలు మన చర్మం నుంచి విడుదలవుతాయి. అందుకే చెమటపట్టిన దేహాల్ని దోమలు కుట్టడానికి ఇష్టపడతాయిట. ఏ, బి రక్త గ్రూపులతో పోలిస్తే ఓ గ్రూప్ రక్తాన్ని దోమలు రెండు రెట్లు అధికంగా ఇష్టపడతాయట. మగదోమలు పూలు, తేనెపై ఆధారపడితే ఆడదోమలు మనుషుల రక్తాన్ని తాగటానికి ఇష్టపడతాయి. మొత్తానికి రక్తదాతలపై మాత్రం దోమల తాకిడి ఎక్కువగా ఉంటుంది.