మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (09:05 IST)

భర్త చొరవ చూపినా.. భార్యలో నిరాసక్తి.. నవ దంపతుల్లో సైతం ఇదే పరిస్థితి... ఎందుకని?

ఇటీవలికాలంలో స్త్రీపురుషుల్లో శృంగారం పట్ల ఆసక్తి గణనీయంగా తగ్గిపోతున్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి కేవలం పిల్లలున్న స్త్రీపురుషుల్లోనేకాకుండా, నవదంపతుల్లో సైతం ఉన్నట్టు ఈ సర్వే ఫలి

ఇటీవలికాలంలో స్త్రీపురుషుల్లో శృంగారం పట్ల ఆసక్తి గణనీయంగా తగ్గిపోతున్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి కేవలం పిల్లలున్న స్త్రీపురుషుల్లోనేకాకుండా, నవదంపతుల్లో సైతం ఉన్నట్టు ఈ సర్వే ఫలితాల ద్వారా తెలుస్తోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చి భాగస్వామిని ఖుషీ చేస్తున్నా.. పడక గది సుఖాన్ని ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావడంలేదట. 
 
ఈ విషయంలో భర్త చొరవ చూపినా.. భార్యలో నిరాసక్తి, భార్య చొరవ తీసుకున్నా.. భర్తలో అశక్తత... ఒకరిలో మార్పు వస్తుందని మరొకరు కొంతకాలంపాటు సహనంతో ఎదురు చూసినా ఫలితం మాత్రం శూన్యం. ఏళ్లు గడుస్తున్నా మార్పు రాకపోవడంతో ఇద్దరిలోనూ నిరాసక్తత పెరిగిపోతోంది. ఆ ఒక్కటి మినహా (సెక్స్‌ తప్ప) అంటూ మిగిలిన జీవితాన్ని లాగిచ్చేస్తున్నారు. 
 
మరికొంతమంది అయితే, కేవలం పిల్లల్ని కనడం కోసం ఆ రెండు మూడు రోజులూ షెడ్యూలు వేసుకుని మరీ దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. చక్కగా ఎంజాయ్‌ చేయాల్సిన శృంగారాన్ని తప్పనిసరి తద్దినంలా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇటువంటి కేసులు మరీ ఎక్కువగా పెరిగాయని, ప్రముఖ సెక్స్ వైద్య నిపుణుడు డాక్టర్ సమరం అంటున్నారు.