Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు..

బాదం, జీడిపప్పులను తీసుకోవడం ద్వారా అందులో మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. పిస్తాలోని బీ6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరాలు రక్తనాళాలను గట్టిపడనీయకుండా చేస్త

Written By selvi
Updated: గురువారం, 12 అక్టోబరు 2017 (10:14 IST)
బాదం, జీడిపప్పులను తీసుకోవడం ద్వారా అందులో మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. పిస్తాలోని బీ6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరాలు రక్తనాళాలను గట్టిపడనీయకుండా చేస్తాయి. ఎండుద్రాక్ష, ఖుబానీ వంటి వాటిల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రక్తహీనత బారినపడకుండా కాపాడతాయి.
 
జీడిపప్పులో కొలెస్ట్రాల్‌ అసలే ఉండదు. పిస్తాలోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలోని ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడతాయి. ఎండుద్రాక్షలో విటమిన్‌ ఎ, క్యాల్షియం పుష్కలంగా వుంటాయి. ఇవి ఎముక పుష్టికి, చూపు బాగుండటానికి దోహదం చేస్తాయి. 
 
జీడిపప్పులోని మెగ్నీషియం, క్యాల్షియం కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదంపప్పులో క్యాల్షియంతో పాటు విటమిన్‌ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు.. చర్మం ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులోనే ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

బొద్దింక జనులను ఎగేసుకున్న స్థానిక జనం, బురదలో పడేసి కుమ్మేసారు, వీడియో

తెలంగాణలో జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీ బ్యానర్‌లు

ఏకాంతం కోసం అడవిలోకి వెళ్లిన ప్రేమికులు, పంజా విసిరిన యమపాశం, వీడియో

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటన రద్దు

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి - జనసేన పార్టీ ఎంపీ కుమారుడిపై కేసు

అన్నీ చూడండి

Radhika Sarathkumar: ;జై బాలయ్య అనే లుక్ తో రాదికా శరత్‌కుమార్ 64వ పుట్టినరోజు పోస్టర్

Allu Arjun: మీర్జాపూర్ లో హర్షితా గౌర్:షోను ప్రశంసించిన అల్లు అర్జున్

షావుకారు జానకిగారితో మా అనుబంధం ప్రత్యేకం - నందమూరి బాలకృష్ణ

ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత

Mega 158: మెగాస్టార్ చిరంజీవి.. మెగా158 రిలీజ్ డేట్ మారనుందా?

తర్వాతి కథనం
Show comments