శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 13 జూన్ 2019 (16:07 IST)

గబ్బిలాలు తినే జామపండ్లను తిన్నారంటే.. నిఫా వైరస్ దాడి ఖాయం?

గబ్బిలాలు తినే జామపండ్లను తిన్నారంటే.. నిఫా వైరస్ దాడి ఖాయం అంటున్నారు వైద్యులు. రెండేళ్ల పాటు నిఫా వైరస్‌ కేరళను తాకింది. నిఫా వైరస్ సోకేందుకు కారణంగా గబ్బిలాలు కొరికి విడిచిపెట్టే పండ్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


తొలుత నిఫా వైరస్ కేరళ ఎర్నాకులంకు చెందిన పరవూరులో  నివసించిన 23 ఏళ్ల యువకుడిని సోకింది. ప్రస్తుతం ఇతనికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. బయో పరిశోధనలో నిఫా వైరస్.. గబ్బిలాలు తిన్న లేకుంటే రుచిచూసిన పండ్ల ద్వారా సోకిందని తెలిసింది. 
 
ఇకపోతే.. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్‌ దాడి చేస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ వ్యాధి వస్తే 54 శాతం మరణాలు సంభవించే అవకాశం ఉందని వైద్యులు విశ్లేషిస్తున్నారు. మూడు రోజులు జ్వరం, జలుబు, తలనొప్పి, అస్థిరత, మానసిక గందరగోళం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. 24నుంచి 48గంటల్లో నిఫా వైరస్‌ వేగంగా వ్యాపించి రోగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.