గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:37 IST)

ముఖంపై ముడతలను నివారించే అన్నం గంజి

అన్నం వంచిన తర్వాత మనం గంజిని పారేస్తుంటాం. దానిలోని పోషకాలు తెలియని చాలా మంది గంజి వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తుంటారు. గంజిలో ఉండే పోషకాలు గురించి తెలిస్తే దానిని వృధా చేయరు. గంజిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
శరీరానికి బలాన్ని అందించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అనేక శారీరక సమస్యలకు ఔషధంగా ఉపయోగపడుతుంది. గంజిలో ఉండే ఆమినో ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది శరీరానికి శక్తిని అందించి కండరాలను దృఢంగా చేస్తుంది. అలసటకు గురికాకుండా చేస్తుంది. 
 
గంజిలో దూది ముక్కను ముంచి మొటాలు ఉన్న ప్రాంతంలో రాసుకున్నట్లయితే మొటాలు నల్లమచ్చలు తగ్గుతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. దీనిని శరీరానికి రాసుకుంటే వయస్సు మీదపడటం వలన వచ్చే ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య చాయలను కప్పి ఉంచుతుంది. గంజిని జుట్టు కుదుళ్లకు రాసినట్లయితే, వెంట్రుకలు మొదళ్ల నుండి బలంగా ఉంటాయి. 
 
ఆరోగ్యమైన ఒత్తైన జుట్టును పొందవచ్చు. ప్రతిరోజూ గంజిని త్రాగడం వలన గ్యాస్ సమస్య దూరం అవుతుంది. మలబద్దకం ఉన్న వారు కూడా ఇది తాగితే మంచి ఫలితం కనబడుతుంది. వేడి చేసిన వారు ఇది త్రాగితే చలువ చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా ఇది మనల్ని రక్షిస్తుంది.