మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (09:43 IST)

చికెన్ కూర, కోడిగుడ్డు ఆమ్లెట్ లేనిదే ముద్ద దిగట్లేదా? ఇక జాగ్రత్త గురూ...

చికెన్ కూర, కోడిగుడ్డు ఆమ్లెట్ లేనిదే ముద్ద దిగట్లేదా? రోజూ డైట్‌లో తప్పకుండా.. చికెన్, ఎగ్ వాడుతున్నారా? అయితే ఇక జాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తున్నారు... పరిశోధకులు. చికెన్, కోడిగుడ్లలో యాంటీబయోటిక్

చికెన్ కూర, కోడిగుడ్డు ఆమ్లెట్ లేనిదే ముద్ద దిగట్లేదా? రోజూ డైట్‌లో తప్పకుండా.. చికెన్, ఎగ్ వాడుతున్నారా? అయితే ఇక జాగ్రత్తగా వుండాలని హెచ్చరిస్తున్నారు... పరిశోధకులు. చికెన్, కోడిగుడ్లలో యాంటీబయోటిక్స్ వాడకంతో ఇవి విషతుల్యమవుతున్నాయని.. వీటిని తినే వారిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోందని లా కమిషన్ నివేదిక వార్నింగ్ ఇస్తోంది. 
 
దీనిపై అధ్యయనం జరిగింది. లా కమిషన్‌కు ఇప్పటికే అందిన నివేదిక ప్రకారం.. కోళ్లకు అందించే దాణా పోషకాలతో కూడినదై ఉండాలి. అయితే మనదేశంలో దాణా నాణ్యత, పరిమాణాన్ని నిర్ధారించేందుకు కచ్చితమైన ప్రమాణాలు అందుబాటులో లేవని కూడా నివేదిక వెల్లడించింది. ఇంకా వాటికి ఉపయోగించే యాంటీబయోటిక్స్ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తగ్గించేస్తుందని వెల్లడి అయ్యింది.