ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (15:45 IST)

రోజుకు ఒకటి రెండు కప్పుల టీ ఓకే.. పదే పదే తాగితే ఊబకాయమే...

రోజుకు రెండు కప్పుల టీ లేదా కాఫీ సేవిస్తే మంచిదే. కానీ అదే నాలుగైదుకు మించితే మాత్రం ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుక

రోజుకు రెండు కప్పుల టీ లేదా కాఫీ సేవిస్తే మంచిదే. కానీ అదే నాలుగైదుకు మించితే మాత్రం ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు టీ తాగుతుంటాం. టీతో పాటు చిప్స్ కూడా నమిలేస్తుంటాం. ఈ రెండు అలవాట్లు ప్రమాదకరమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
రోజుకు 3 కంటే అధికంగా పదేపదే టీలు తాగడం వల్ల శరీరంలో ఆక్సిడెంట్లు పెరిగిపోతాయని, ఊబకాయంతో పాటు క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టీలు.. కాఫీలకు బదులుగా గ్రీన్ టీ తాగాలని, అది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని సూచిస్తున్నారు. వారాల తరబడి ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలను తీసుకోకుండా.. తాజా కూరగాయలు, కూరలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు అంటున్నారు.