శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:22 IST)

కంటి ఆరోగ్యం కోసం కోడిగుడ్లు, పసుపు, ఆరెంజ్ పండ్లు తీసుకోండి..

మీ కళ్లు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండాలంటే.. ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విశ్రాంతి లేకపోవడంతో మీ కళ్లు నీరసంగా కనిపించడంతో పాటు కంటి కింద వలయాలు ఏర్పడుతున్నాయి.

మీ కళ్లు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండాలంటే.. ఎనిమిది గంటల పాటు నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విశ్రాంతి లేకపోవడంతో మీ కళ్లు నీరసంగా కనిపించడంతో పాటు కంటి కింద వలయాలు ఏర్పడుతున్నాయి. 
 
అందుకే ఎంత నవ్వినా కంటిలో కాంతి కనుమరుగైపోతోంది. ముఖ అందానికి కంటి అందం చాలా అవసరం. మీ కళ్లను అందంగా ఉంచుకోవాలంటే మీ కంటికి విశ్రాంతితో పాటు వ్యాయామం కూడా అవసరం. కంటితో మెదడు నరాలకు సంబంధం ఉండటంతో కంటికి విశ్రాంతి ఇవ్వాలి. 
 
కంప్యూటర్స్ ముందు గంటల పాటు కూర్చుని పనిచేసే వారైతే అప్పుడప్పుడు గార్డెన్‌ను చూడొచ్చు. కంటికి ఇంపుగా ఉండే రంగుల్ని చూడొచ్చు. ఇంకా క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండే తాజా కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, పసుపు లేక ఆరెంజ్ రంగు పండ్లు తీసుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా నీటిని అప్పుడప్పుడు సేవిస్తూ ఉండాలి. 
 
ఎప్పుడూ కళ్లు అందంగా ఉండాలంటే చల్లని పాలలో దూదిని అద్ది కంటిపై ఉంచాలి. లేదా బంగాళాదుంపల్ని ముక్కలుగా చేసి కంటిపై ఉంచాలి. అలాగే గోరువెచ్చని నీటిలో ఉంచిన టీ బ్యాగును కాసేపు కంటిపై ఉంచొచ్చు.