Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కోపాన్ని తగ్గించుకునే చిట్కాలు...

Updated: శుక్రవారం, 12 అక్టోబరు 2018 (17:02 IST)
చాలామంది ప్రతి చిన్న విషయానికి కోప్పడతారు. దీంతో నలుగురు నోళ్ళలో కి చెడుగా కనిపిస్తుంటారు. ప్రతి చిన్న విషయానికి కోపగించుకున్నా... శారీరక ఉద్వేగాలకులోనైనా అనారోగ్య సమస్యలబారిన పడుతుంటారు.
 
కోపాన్ని అణుచుకోవడం కంటే.. అసలు కోపం తెచ్చుకోకుండా శరీరాన్ని సమాయత్తం చేసుకోవడం ఉత్తమం. ఇందుకు ధ్యానం ముఖ్య సాధనం. ప్రతి రోజూ ఉదయాన్నే అర్థగంట నడకతో మొదలు పెట్టి.. 40 నిమిషాలపాటు యోగా చేసి.. మరో 15 నిమిషాలు ధ్యానం చేయడం ఉత్తమం. ఇలా సాధన చేయడం వల్ల మనసు నిగ్రహించుకునే శక్తిని పొందుతుంది. 
 
అలాగే, ఉదయం ఎంత ఆహ్లాదంగా ఉంటే.. ఆ రోజు అంతే ప్రశాంతంగా గడుస్తుంది. ఇక, ఆహారాన్ని మార్చుకోక తప్పదు. ఉద్రేకాలను ప్రేరేపించే మసాలాలు, ఉప్పు, కారం తగ్గించుకోవాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. 
 
కాలానికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో అయితే రోజూ కీరా ముక్కలు, పుచ్చకాయ, టొమాటో రసం, ఫ్రూట్‌ సలాడ్స్‌, పల్చటి మజ్జిగ తీసుకోవాలి. వీలైనంత మేరకు మంసాహారం తగ్గించాలి. 
 
ధూమపానం, మద్యం కూడా ఉద్రేకాలకు కారణం అవుతాయి. ఇక, కోపతాపాలకు నిద్రాభంగం కూడా ఒక కారణం. సుఖవంతమైన నిద్ర కరువైతే చికాకులు ఎక్కువవుతాయి. నిద్రను మాత్రం దూరం చేసుకోవద్దు. ఇలాంటివి చేయడం వల్ల మనసుని నిగ్రహంగా ఉంచుకోవడమే కాకుండా, ప్రశాంతంగా జీవించవచ్చు. 

అన్నీ చూడండి

Weather forecast: October 14, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఈ పీట నాకెందుకండీ అంటూ దుర్గ గుడిలో కింద కూర్చున్న సీఎం విజయ్, వీడియో

చిటికెలో నా ఉద్యోగం ఊడింది, మీ ఉద్యోగం వుంటుందో లేదో: అమెరికా నుంచి టెక్కీ వీడియో

విజయవాడలో సీఎం విజయ్ మానియా.. వైరల్ అవుతున్న వీడియోలు.. ఫోటోలు

దేశంలో స్టార్ లింక్ అనుమతులు నిలిపివేయాలి : స్వదేశీ జాగరణ్ మంచ్

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments