నిద్రపట్టకపోతే ఏం చేయాలి?
నిద్ర పట్టక చాలామంది అవస్తలు పడుతుంటారు. రాత్రి పూట నిద్ర మన మెదడును మరింత ఉత్తేజపరిచి, చురుకుగా అన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల వరకు తప్పనిసరిగా నిద్రపోవాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నా
నిద్ర పట్టక చాలామంది అవస్తలు పడుతుంటారు. రాత్రి పూట నిద్ర మన మెదడును మరింత ఉత్తేజపరిచి, చురుకుగా అన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల వరకు తప్పనిసరిగా నిద్రపోవాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో నిద్ర రాకపోవడం సహజం.
ఎంత ప్రయత్నించినప్పటికీ నిద్ర రాదు. కళ్లు బరువుగా అనిపించి, నిద్రపోవాలనుకున్నా సామాన్యంగా రాదు. కొంతమందయితే రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఏవో పనులు చేసుకోవడం, పార్టీల పేరుతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో హానికరం. నిద్ర కనుక సమయానికి రాకపోతే.. అందుకు కొన్ని సహజ మార్గాలలో చిట్కాలు అందుబాటులో వున్నాయి.
తాజాగా నిర్వహించిన పరిశోధనల ఆధారంగా చేపలు, చెర్రీలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా నిద్ర వస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే చెర్రీస్ లలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్లు ఎక్కువగా వుంటాయి. అలాగే చేపలలో వుండే పోషక విలువలు మెదడును ప్రశాంతంగా వుంచేందుకు ప్రేరేపిస్తాయి. తద్వారా నిద్రపడుతుంది. అప్పటికీ నిద్ర పట్టకపోతే చదువుకోవడం, లేదా అర గంట పాటు ఏమైన రాసుకుంటుంటే ఖచ్చితంగా నిద్రపడుతుంది.
శరీరం ఎంత అలసిపోతుందో అంతే ఎక్కువగా నిద్ర వస్తుంది. ప్రస్తుతకాలంలో ఉద్యోగస్తులు ఎల్లప్పుడూ కుర్చీలలో కూర్చొని, కంప్యూటర్ ముందు కాలయాపన చేస్తుంటారు. దాంతో వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా రాత్రి పూట నిద్ర పట్టదు. అటువంటి సమయాల్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో వ్యాయామం చేస్తే ఎంతో ఆరోగ్యకరం. వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోతుంది. మెదడులో వున్న ఆలోచనలన్ని తొలగిపోయి, ప్రశాంతతను కోరుకుంటుంది. ఫలితంగా నిద్ర అనుకోకుండానే వచ్చేస్తుంది.