ప్రొస్టేట్ క్యాన్సర్‌ని నివారించే "టొమోటో"
పురుషుల్లో ప్రొస్టేట్ గ్రంథికి క్యాన్సర్ సోకకుండా ఆపడంలో టమోటోలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. టొమోటోలలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో హానికారకమైన ఫ్రీరాడికల్స్‌ను రాకుండా అడ్డుకుంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటంలో టొమోటోలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
టమోటోలు కూరకు మంచి రంగు, రుచిని ఇవ్వటమే కాకుండా.. వయసు తాలూకు ప్రభావం, చర్మం ముడుతలు లాంటి వాటినుంచి కాపాడుతాయి. ప్రతిరోజూ మన శరీరానికి అవసరమైన విటమిన్లలో చాలావరకు టొమోటోలు తీసుకోవటం వల్ల పొందవచ్చు. క్యాన్సర్ వ్యాధి రాకుండా టొమోటోలు నిరోధిస్తాయి.
సహజమైన రంగు కలిగిన టమోటోలలో ఉండే లైకోపిన్ అనే యాంటీ యాక్సిడెంట్, ముఖ్యంగా పచ్చి టొమోటోలలో అధికంగా ఉంటుంది. దీనివల్ల ఒక యాపిల్ పండు తింటే వచ్చే ఫలితం కంటే, ఒక పచ్చి టొమోటోను తినటంవల్ల వచ్చే ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలాగే కంటిలోని మాక్యులా ఆరోగ్యంగా ఉండేందుకు, క్యాన్సర్ల నివారణకు కూడా ఈ లైకోపిన్ బాగా సహకరిస్తుంది.