1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 మే 2025 (23:33 IST)

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

kavitha
తన తండ్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ దేవుడు అని ఆయన చుట్టూత కొన్ని దెయ్యాలు చేరివున్నాయంటూ ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవిత అన్నారు. తన తండ్రి కేసీఆర్‌కు ఆమె వ్యక్తిగతంగా రాసిన లేఖ బహిర్గతమైంది. ఇది ఆ పార్టీలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్‌ను దేవుడుతో పోల్చిన ఆమె.. ఆయన చుట్టూ కొందరు దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్‌కు లేఖ రాసింది వాస్తమేనన్నారు. అయితే, అది ఎలా బయటకు వచ్చిందో తెలియదన్నారు. 
 
ఆ లేఖలో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదన్నారు. కేవలం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు. ఆ లేఖ నాదే.. అందులో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే చెప్పాను అని తెలిపారు.
 
కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు  ఉన్నాయి. అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి. నా లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని కొందరు కోర్టులో ఈ లేఖను లీక్ చేసిన ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.