Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)
తమిళనాడులో ఓ బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన కండక్టర్ బస్సు ఇంజిన్‌ను ఆఫ్ చేసేశాడు. బస్సుకు బ్రేక్ వేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురైన తర్వాత అప్రమత్తమైన కండక్టర్ బస్సును ఆపేశాడు. అయితే ఆ బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మరణించాడు.
వాహనం కదులుతూనే ఉండటంతో డ్రైవర్ తన సీటుపై కుప్పకూలిపోయినట్లు వీడియోలో తెలుస్తోంది. డ్రైవర్ కుప్పకూలడంతో ప్రయాణీకులు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ డ్రైవర్ ప్రాణాలు అప్పటికే గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలో గాయాలేవీ కాలేదని.. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.