బరువు తగ్గాలని ఇబ్బందులు తెచ్చుకోవద్దు.. ట్రెడ్ మిల్ వద్దే వద్దు..
చాలా మంది బరువు తగ్గేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేయడం. దీంతో ఇపుడు అనేక మంది ట్రెడ్‌మిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే, ఎక్కువ సమయం
చాలా మంది బరువు తగ్గేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేయడం. దీంతో ఇపుడు అనేక మంది ట్రెడ్‌మిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే, ఎక్కువ సమయం ట్రెడ్‌మిల్‌పై గడిపినట్టయితే బరువు తగ్గుతామనే ఆలోచన వారిలో బలంగా ఉంటుంది. ఇలా అతిగా ప్రవర్తించి.. లేనిపోని కొత్త ఇబ్బందులను తెచ్చుకుంటున్నారని వ్యాయామ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి ఇబ్బందుల్లో అలసట, నీరసం ఒకటి. ట్రెడ్‌మిల్‌పై అతిగా చేస్తే వ్యాయామం హార్మోన్లు తయారీ పంపిణీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్యానికి సరిపడే విధంగానే వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.