Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అల్సర్ వున్న వాళ్లు అల్లం జోలికి మాత్రం వెళ్లకూడదు.. తెలుసా?

Written By సందీప్
Updated: శనివారం, 1 జూన్ 2019 (12:32 IST)
అల్లం చాలా వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుందని మనకు తెలుసు. కానీ అల్సర్ ఉన్నవారు మాత్రం అల్లం జోలికి వెళ్లకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అల్లం కొద్దిగా కారంతో కూడిన ఆహారం. వాటితో చేసే పదార్థాలు కూడా కారంగానే ఉంటాయి. కాబట్టి శొంఠి, అల్లం జోలికి అల్సర్ వ్యాధిగ్రస్తులు వెళ్లకూడదు. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే దానిని తీసుకోవాలి. 
 
అల్సర్ ఉన్న వారు పరగడుపున అల్లంతో చేసిన వంటకాలను, అల్లంతో చేసిన మందులను తీసుకోకూడదు. అలా చేస్తే ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఆహారం తీసుకున్నాకే అల్లంతో చేసిన వంటకాలను, మందులను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇక అల్లం నయం చేసే వ్యాధుల విషయానికి వస్తే, అల్లం పిత్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 
 
ఆకలి లేమిని నయం చేస్తుంది. వేవిళ్లు, కడుపు ఉబ్బరం, శ్వాసకోశ సమస్యలను అల్లం నయం చేస్తుంది. వికారం, వాంతులు తగ్గించడంలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళల్లో వేవిళ్లు తగ్గాలంటే అల్లాన్ని రెగ్యులర్‌గా తినిపించాలి. 
 
ఇంకా గొంతు నొప్పికి అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతుంటే, నీటిలో అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. తర్వాత అందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అన్నీ చూడండి

నా భర్తకి ఉద్యోగం ఇప్పిస్తామని రష్యా సైన్యంలో చేర్పించారు.. మహిళ ఫిర్యాదు

తీర్థం ఇస్తే తాగినట్టు నటిస్తూ వేళ్ల సందుల్లోంచి కిందకు వదిలేస్తారు : వైకాపా నేతలపై విజయసాయి ఫైర్ (Video)

కూతురుని కాపురానికి పంపకుంటే మనవరాలి ఫోటోలు బయటపెడతా : అత్తకు అల్లుడి వార్నింగ్

ఆ 3 రాష్ట్రాలకు బొద్దింకలు రాలేవు, ఎందుకో తెలుసా?

టీడీపీ, జనసేన మద్దతుదారుల మధ్య విభేదాలు.. ఫేక్ అకౌంట్లు.. ఎన్డీఏ ఆందోళన

అన్నీ చూడండి

Ranabali trailer: రాయలసీమలో అణచివేతకు పోరాడే రాజవంశం కథగా రణబలి ట్రైలర్

Shruti Haasan: ఆ టాయ్స్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడిన శృతిహాసన్

ఆకట్టుకునేలా గుడ్ టైమ్ ట్రైలర్ : అనిల్ విశ్వనాథ్, కామాక్షి భాస్కర్ల

Shweta Basuprasad: వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ వెబ్ సిరీస్ నా వైఫ్ మిస్సింగ్

Sree Vishnu: నక్సల్ బ్యాక్‌డ్రాప్‌ అయినా మంచి ఎంటర్టైనర్ చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments