శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (16:32 IST)

అల్లం టీతో చెడు కొలెస్ట్రాల్ మటాష్..

టీలో అల్లం మిక్స్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అల్లం టీ త్రాగుతుంటే ఆ అనుభూతే వేరు. శరీరానికి ఉత్సాహం, ఎనర్జీ వచ్చి చాలా చురుకుగా పనిచేస్తారు. అల్లం మంచి ఆయుర్వేద మందు. ఎన్నో ఔషధాలలో దీనిని ఉపయోగిస్తారు. ఇది తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం పొందవచ్చు. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
ప్రయాణంలో కడుపు తిప్పే వారికి, వాంతులు చేసుకునేవారికి అల్లం టీ ఇస్తే ఉపశమనం కలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తేన్పులు, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు అల్లం టీ త్రాగితే ఫలితం ఉంటుంది. పీరియడ్స్ సమయాలలో ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు ఇది దివ్యౌషధం. 40 పైబడిన వారిలో వచ్చే కీళ్లనొప్పులు, నడుము నొప్పిని అల్లం టీ త్రాగడం ద్వారా దూరం చేసుకోవచ్చు. 
 
జ్వరం, జలుబును అల్లం టీ తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించి రోగాలు రాకుండా చూస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అల్లం టీ త్రాగితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ని కూడా ఇది తగ్గిస్తుంది, తద్వారా గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.