గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (13:06 IST)

గుండె జబ్బులకు చెక్ పెట్టే చేపలు..

సోయా, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు తీసుకుంటే గుండె పదిలంగా వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజూ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అధిక కొవ్వుతో గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారించుకోవచ్చునని వారు చెప్తున్నారు. 
 
అందుకే ప్రతిరోజూ రెండు కప్పుల సోయా, తృణధాన్యాలు, గింజలను తీసుకోవడం ద్వారా శరీరంలోని హానికర ఎల్డీఎల్ కొవ్వులను ఐదు శాతం మేరకు తగ్గించుకోవచ్చునని.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో భాగంగా ప్లాంట్ ప్రొటీన్లతో పాటు కొవ్వును తగ్గించే ఓట్స్, బార్లీ వంటివి తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు. 
 
అలాగే గుండె ఆరోగ్యంగా వుండాలంటే.. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కనుక చేపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను రోజూ గుప్పెడు మోతాదులో తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాటిల్లో ఉండే అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రక్తనాళాలు వాపుకు గురి కాకుండా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.