సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (13:59 IST)

పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే మామిడి పండు..

మామిడి పండ్లలో రారాజు. మామిడి పండులో విటమిన్‌ ఎ, విటమిన్‌ ఇ పుష్కలంగా ఉండటం వల్ల యాక్నె సమస్య తగ్గుతుంది. చర్మంపై ముడతలు తొలగిపోతాయి.. తేమతో అందంగా కనిపిస్తుంది. బీటాకెరటిన్‌ పుష్కలంగా ఉండే మామిడిపండ్లు ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
 
మామిడిపండ్లని తినడం వల్ల తల వెంట్రుకల కుదుళ్లని తేమతో ఉంచేందుకు అవసరం అయిన సెబమ్‌ పుష్కలంగా ఉత్పత్తి అవుతుంది. మామిడిలోని పీచు... శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది. మృతచర్మాన్ని తొలగించి చర్మరంధ్రాలని తెరుచుకునేటట్టు చేస్తుంది. దాంతో చర్మం కాంతితో మెరిసిపోతుంది.
 
మామిడి పండులో ఫైబర్‌, ప్రొటీన్స్‌, విటమిన్‌ ఏ, సీ, బీ, ఇలతో పాటు కాపర్‌, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. 
 
మామిడి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు తగ్గిస్తాయి. రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. ఈ పండులోని విటమిన్‌ సీ, ఫైబర్‌ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వ్యక్తులు మామిడి పండ్లను తింటే ఉపశమనం లభిస్తుంది.
 
మామిడి పండ్లలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య ఉన్న వారికి మేలు చేస్తుంది. మామిడి పండ్లలో శరీర రోగ నిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్‌ సమృద్ధిగా ఉంఉంది. తద్వారా శరీర రోగ నిరోధక శక్తి పెరిగి శరీరం బలోపేతం అవుతుంది.
 
మామిడి పండ్లలో ఉండే విటమిన్‌ ఏ కంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి. పచ్చి మామిడి తినడం ద్వారా ఊరిపితిత్తులు శుభ్ర పడతాయి.
 
మామిడి పండును తినడం ద్వారా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. చర్మ సమస్యలు పోతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.