శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : ఆదివారం, 12 మే 2019 (12:15 IST)

గుడ్డు సొనలో బాగా మగ్గిన అరటిపండు గుజ్జును కలిపి?

కోడిగుడ్డు సొనలో బాగా మగ్గిన అరటిపండు గుజ్జును కలిపి తలకు పూతలా వేయండి. అరగంట అయ్యాక కడిగేసుకుంటే చాలు. జుట్టు మెరుస్తుంది. అలాగే ఎండ ప్రభావం చర్మంపై పడటం వల్ల చేతులు, కాళ్లు పొడిబారినట్లు అవుతాయి.


అందుకే స్నానానికి అరగంట ముందు కొబ్బరినూనె కాళ్లు, చేతులకు రాసుకుని, నలుగుపెట్టుకుని రుద్దుకోవాలి. చర్మం తాజాగా ఉండటమే కాదు... మృదువుగానూ మారుతుంది. 
 
చర్మంపై ఎండ ప్రభావం విపరీతంగానే ఉంటుంది. ఇలాంటప్పుడు తేనెను ముఖానికి రాసి... మర్దన చేయాలి. ఇది ఆరిపోయాక కడిగేసుకుంటే చాలు. చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది.

రెండు పెద్ద చెంచాల గులాబీనీటిలో చెంచా చొప్పున నిమ్మరసం, కీరదోస రసం కలిపి ముఖానికి పట్టించి మర్దన చేయాలి. కాసేపయ్యాక కడిగేస్తే చాలు.. నిమ్మరసం నలుపును తొలగిస్తే... కీరదోస, గులాబీనీరు చర్మాన్ని చల్లబరుస్తాయి.