శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (12:17 IST)

డిన్నర్‌కు ముందు ఓ గ్లాసు వెజిటబుల్ జ్యూస్ సిప్ చేయండి.. బరువు తగ్గండి..

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే డిన్నర్‌కు ముందు ఓ గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ సూప్ తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేగాకుండాశరీరానికి కావలసిన పోష

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే డిన్నర్‌కు ముందు ఓ గ్లాసు వెజిటబుల్ జ్యూస్ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ సూప్ తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చు. అంతేగాకుండాశరీరానికి కావలసిన పోషకాలు కూడా లభిస్తాయి. కూరగాయలలోని సాల్యుబుల్‌ పీచు, తక్కువ సోడియం శాతాలు అధిక బరువును నియంత్రించడంలో ఎంతో సాయపడతాయి. అలాగే టమోటా జ్యూస్ కూడా బరువును తగ్గిస్తుంది. 
 
ఇంకా బరువు తగ్గాలంటే మాంసాహారం కంటే.. పాలకూర, కీరా, సొరకాయ వంటివి ఈ జ్యూస్‌లు ఉపయోగించడం మంచిది. కానీ వెజ్ సూప్ ద్వారా లేదా జ్యూస్ ద్వారా ఆరోగ్యం... అందం.. రెండూ సొంతం చేసుకోవచ్చు. సోడియం తక్కువగా వుండే వెజిటెబుల్‌ జ్యూస్‌ ప్రతిరోజూ తాగిన వారు 12 వారాల్లో రెండు కేజీల బరువు తగ్గినట్లు పరిశోధనలు ఇప్పటికే తేల్చేశాయి.