1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2016 (09:18 IST)

అధిక కోపమా... అయితే భారీకాయం ఖాయం

ఒక వ్యక్తి బరువు పెరగడానికి అతనికి ఉన్న ఆవేశమే ప్రధాన కారణమని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆన్ ఏజింగ్ అనే సంస్థ నిర్వహించిన తాజా అధ్యయంలో వెల్లడైంది. ముఖ్యంగా రోజువారీ జీవితంలో సహనంతో ఉండేవారి బరువులో పెద్ద మార్పులేవీ కనిపించలేదని ఈ సంస్థకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. 
 
వ్యక్తిత్వ విలక్షణతకు అధిక బరువుకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ఈ పరిశోధకులు మొత్తం 1,988 మందిని ఎంపిక చేసి వారి జీవన విధానం, బరువు, ఆహారపు అలవాట్లపై అధ్యయనం చేశారు. 
 
ఈ అధ్యయనంలో వ్యక్తుల వయస్సు పెరుగుతున్న కొద్దీ బరువు కూడా పెరగడానికి వారిలో ఉండే కోపమే కారణమంటున్నారు. వ్యక్తి వయస్సుతో పాటు బరువు పెరగకుండా ఉండాలంటే ఆవేశం తగ్గించుకుని, సమతుల్య ఆహారం తీసుకుంటూ రోజులో కొంత సేపు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
 
అయితే, అవేశపరులు పనులు చేయాడానికి ఇష్టపడరని, కానీ, తినడానికి, విందు భోజనాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు. నిదానంగా వ్యవహిరించేవారు ఒక రోజు ఆహారం ఎక్కువగా తీసుకున్నా తర్వాత రోజు తక్కువగా తీసుకుంటారని, ఆహారం తీసుకోవడంలో నియంత్రణ పాటిస్తారని వారంటున్నారు.