ganesh chaturthi

బరువు తగ్గేందుకు సరికొత్త మార్గం...

Written By కుమార్
Updated: గురువారం, 30 మే 2019 (20:17 IST)
ఈ రోజుల్లో చాలా మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు కొందరు అన్నం మానేసి ఏవేవో తినేస్తుంటారు, మరికొందరేమో పూర్తిగా తినకుండా కడుపు మాడ్చుకుంటూంటూరు. అయితే ఈ రెండు పద్ధతులూ సరికావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే బరువు తగ్గేందుకు ఓ మార్గాన్ని కూడా సూచిస్తున్నారు.
 
బరువు తగ్గాలనుకునే వారు తాము తినే ఆహార పదార్థాల్లో కొవ్వు పూర్తిగా ఉండకూడదనుకుంటారు. అయితే ఇది పొరబాటు. శరీర వ్యవస్థలు, హార్మోన్లు సమతుల్యంతో పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్‌ కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. లేకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే శరీరానికి హాని కలిగించని కొవ్వు పదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాదం, వాల్‌నట్లూ, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్‌బ్రాన్‌ నూనె వంటివి ఆహారంలో తీసుకోవాలి.
 
శరీరానికి తగినంత శక్తి అందకుంటే ఆకలి నియంత్రణలో ఉండదు. అలాంటప్పుడు ఏవి పడితే అవి తినేస్తాం. దీన్ని అదుపులో ఉంచాలంటే పొద్దున్నే అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అందులోనూ మాంసకృత్తులూ, పీచు, పిండిపదార్థాలున్నవి ఎంచుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకున్నవారవుతారు. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలూ వంటివీ మీ ఆహార ప్రణాళికలో ఉండేలా చూసుకోవాలి.
 
బరువు పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే పిండిపదార్థాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. 

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments