సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 30 మే 2019 (18:48 IST)

పరగడపన రాగి అంబలి తాగితే...

ధాన్యపు గింజల్లో రాగులు చాలా ముఖ్యమైనవి. ఇవి శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఎన్నో పోషక పదార్థాలు ఉండటమే దీనికి కారణం. రాగి సంగటి ఆరగించడం లేదా రాగి అంబలి తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రాగితో తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను భుజించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ధాన్య‌పు గింజ‌లైన రాగుల్లో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి. అవి మ‌న శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే రాగుల‌తో త‌యారు చేసే అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ప్ర‌ధానంగా బ‌రువు త‌గ్గుతారు. ఇంకా చాలా లాభాలే ఉన్నాయి.
 
ఈ క్ర‌మంలో రాగి అంబ‌లిని ఎలా తయారు చేయాలో, దాంతో మ‌న‌కు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా శరీరానికి కావ‌ల్సిన శ‌క్తి, పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి. రాగి అంబ‌లికి చ‌లువ చేసే గుణం ఉంది. దీంతో శరీరంలో ఉండే అధిక వేడిని త‌గ్గించుకోవ‌చ్చు. ఒక గ్లాస్ రాగి అంబ‌లి తాగినా చాలా సేపు ఆక‌లి వేయ‌దు. దీంతో క‌డుపు నిండిన భావ‌న కలుగుతుంది. ఆహారం ఎక్కువ‌గా తినాల‌నిపించ‌దు. ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. స్థూల‌కాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.