వంకాయల్లో ఉప్పుకారం వేసి నూనెలో వేయించుకుని తింటే...
కూరగాయలలో వంకాయకి ప్రత్యేక స్థానం ఉంది. వంకాయతో తయారు చేసిన కూరలు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే, వంకాయలతో తయారు చేసిన కూరలు ఆరగిస్తే అలర్జీలు, దురదలు వస్తాయని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ దీనిలో నిజం లేదు. పైగా వంకాయ తింటే దురదలు తగ్గుతాయి. వంకాయ వలన ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ లేదు. దీని ప్రయోజనాలు అనేకం.
నీలం రంగు వంకాయలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. దీనిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రక్తప్రసరణను వంకాయ మెరుగుపరుస్తుంది. అధిక బరువు ఉన్నవారు వంకాయ తింటే మంచిది.
వంకాయలను నూనెలో కొద్దిగా ఉప్పు, కారం వేసి వేయించుకుని తింటే బరువు తగ్గుతారు. అంతేకాకుండా మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. వంకాయను కూరగా కాకుండా పచ్చిడిగా కూడా చేసుకుని తినవచ్చు. వంకాయ పచ్చడిని అన్నంతో కలుపుకుని తింటే రుచిని ఆశ్వాదించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.