గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 15 మే 2019 (18:35 IST)

ప్రతి రోజూ బత్తాయి రసాన్ని తాగితే...

పండ్ల రసాలు మన శరీరానికి పోషకాలు అందిస్తాయి. చాలా పండ్ల లాగానే బత్తాయి రసం కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. స్వీట్ లెమన్, మోసంబి అని పిలువబడే ఈ బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. వ్యాధినిరోధన శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. బత్తాయిలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చుతుంది. 
 
బత్తాయిలో పొటాషియం, పాస్పరస్, మినరల్స్ ఎక్కువగా ఉండడం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు బత్తాయి రసాన్ని రోజూ ఒక గ్లాసుడు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. బత్తాయి రసాన్ని తాగితే అలసట నుండి ఉపశమనం పొందవచ్చును. రక్తంలోని ఎర్ర రక్త కణాలను బత్తాయి వృద్ధి చేస్తుంది. 
 
పిల్లల ఎదుగుదలకు బత్తాయి తోడ్పడుతుంది. వృద్ధుల్లో కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. 30 ఏళ్లు దాటిన మహిళలు రోజు ఒక గ్లాసు బత్తాయి రసం త్రాగితే మంచిది. జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అర గ్లాసు బత్తాయి రసాన్ని తీసుకుంటే మంచిది. బత్తాయిలోని క్యాలరీలలో బరువును తగ్గించే సూచనలున్నాయి. ఇది కంటికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణుల సూచిస్తున్నారు.