గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 28 మే 2019 (22:08 IST)

పొన్నగంటి కూర ప్రయోజనాలివే...

ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరల్లో పొన్నగంటికూరలో అనేక రకములైన ఔషద గుణాలు దాగి ఉన్నాయి.పొన్నగంటి కూరతో కంటి చూపు మెరుగుపడుతుంది. ముఖ్యంగా వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నవారు పొన్నగంటి కూర తినడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను, వీర్యకణాల్లోని లోపాలను సరిచేస్తుంది. అదెలాగో చూద్దాం.  
 
1. టేబుల్‌ స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయి.
 
2. కంటి కలకలకు, నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది. వైరల్, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది.
 
3. మధుమేహంతో బాధపడేవారికి పొన్నగంటి కూర కణజాలం దెబ్బతినకుండా చూడటంతో పాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. అందుకే ఇతర మందులతో పాటుగా ఆహారంలో దీన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
4. వీర్యకణాల లోపం ఉన్నవారికి సంతాన సమస్య తలెత్తుతుంది. ఆ సమస్యను నివారించుకోవడానికి పొన్నగంటికూరను ఆహారంలో బాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
5. మొలల వ్యాధినీ ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవునెయ్యితో వండుకుని తింటే మంచిదట. రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.