మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (12:34 IST)

బరువు తగ్గాలంటే.. సలాడ్స్ తీసుకోండి.. పిజ్జా తినకండి..

బరువు తగ్గాలంటే.. సలాడ్స్ తీసుకోండి.. పిజ్జా తినకండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సలాడ్స్‌ ఆరోగ్యకరమైన ఆహారమేనని వారు చెప్తున్నారు. చీజ్‌, నట్స్‌, క్రీమ్‌ లాంటివి సలాడ్స్‌లో కలపకూడదు. అల

బరువు తగ్గాలంటే.. సలాడ్స్ తీసుకోండి.. పిజ్జా తినకండి.. అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సలాడ్స్‌ ఆరోగ్యకరమైన ఆహారమేనని వారు చెప్తున్నారు. చీజ్‌, నట్స్‌, క్రీమ్‌ లాంటివి సలాడ్స్‌లో కలపకూడదు. అలా కాదని ఇవన్నీ వేసిన సలాడ్స్‌ తింటే ఒక పిజ్జా తినడం వల్ల పొందే ఫ్యాట్‌ కన్నా కూడా ఎక్కువ ఫ్యాట్‌ శరీరంలో చేరుతుంది. ఫ్లేవర్‌ కావాలనుకుంటే సలాడ్స్‌లో ఏవైనా గింజలు వేసుకోవచ్చు.
 
అలాగే అవకాడొలో ఎన్నో పోషకవిలువలు ఉంటాయి. ఒక్క అవకాడొలో పది గ్రాముల పీచుపదార్థం ఉంటుంది. అంతేకాదు అరటిపండ్లలో ఉన్నంత పొటాషియం అవకాడొలో ఉంటుంది. యాంటాక్సిడెంట్లు కూడా వీటిల్లో బాగా ఉంటాయి. లావు తగ్గాలంటే అవకాడొను పరిమితంగా తినాలి. ఎందుకంటే వీటిల్లో కాలరీలు బాగా ఉంటాయి. కొవ్వు పదార్థం కూడా ఎక్కువే. అందుకే సలాడ్స్‌లో గాని, శాండ్‌విచెస్‌లోగాని అవకాడొను పరిమితంగా వాడాలి. రోజుకు ఒక అవకాడొ మించి తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.