శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 15 డిశెంబరు 2016 (18:31 IST)

కాఫీతో అవన్నీ చేకూరుతాయి... కానీ...

కాఫీ... దీని గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. పాలు, పంచదార, డికాషన్‌ కలిపి ఆ మిశ్రమాన్ని కాఫీ అంటారు. కాఫీ త్రాగటం వల్ల శారీరక బడలిక తగ్గి మానసికోత్సాహం కలుగుతుంది. ప్రస్తుత కాలంలో కాఫీ త్రాగటం ప్రతి మనిషి రోజూ చేసే నిత్యకృత్యమైపోయింది. కాఫీ తీసుకున్

కాఫీ... దీని గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. పాలు, పంచదార, డికాషన్‌ కలిపి ఆ మిశ్రమాన్ని కాఫీ అంటారు. కాఫీ త్రాగటం వల్ల శారీరక బడలిక తగ్గి మానసికోత్సాహం కలుగుతుంది. ప్రస్తుత కాలంలో కాఫీ త్రాగటం ప్రతి మనిషి రోజూ చేసే నిత్యకృత్యమైపోయింది. కాఫీ తీసుకున్నాక అది జీర్ణమవడానికి 3 గంటల సమయం పడుతుంది.
 
కాఫీ త్రాగితే జలుబు, తలనొప్పి, జ్వరం, మూత్రం విసర్జనలో ఇబ్బంది పడటం తగ్గుతుంది. అలాగే దగ్గు, అతి నిద్రమొదలైనవి తగ్గిపోతాయి. ఎక్కువ బ్రాందీ, విస్కీ తాగుట వల్ల కలిగిన చెడు లక్షణములు కాఫీత్రాగుట వల్ల నశిస్తాయి.
 
స్త్రీలకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం కలిగే మానసిక ఒత్తిడి కాఫీ త్రాగటం వల్ల తగ్గిపోతుంది. చిన్న పిల్లలకు ఏ రూపంలో కాఫీ ఇచ్చినా వారి ఎదుగుదలను అరికడుతుంది. కాఫీ మితిమీరి త్రాగుతుంటే కడుపులో యాసిడ్‌ అధికమవుతుంది. అల్సర్‌, ఆకలి మందగించుట, రక్తపోటు, గుండె దడ, నిద్రలేమి మొదలైనవి సంభవిస్తాయి. కనుక కాఫీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా.