గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (16:36 IST)

రతికి ఏ సమయం అనుకూలం? ఆయుర్వేదం ఏమంటోంది?

సాధారణంగా స్త్రీపురుషులు రతిలో పాల్గొనేందుకు నిర్దిష్ట సమయాలంటూ ఉంటాయి. ఎక్కువ మంది రాత్రి వేళల్లోనే శృంగారంలో పాల్గొంటారు. ఇక కొంద‌రు ప‌గ‌లు, మరికొంద‌రు ఉద‌యం... ఇలా జంట‌లు త‌మ ఇష్టాలు, అభిరుచుల‌కు అ

సాధారణంగా స్త్రీపురుషులు రతిలో పాల్గొనేందుకు నిర్దిష్ట సమయాలంటూ ఉంటాయి. ఎక్కువ మంది రాత్రి వేళల్లోనే శృంగారంలో పాల్గొంటారు. ఇక కొంద‌రు ప‌గ‌లు, మరికొంద‌రు ఉద‌యం... ఇలా జంట‌లు త‌మ ఇష్టాలు, అభిరుచుల‌కు అనుగుణంగా శృంగారంలో పాల్గొంటారు. అయితే నిజానికి సైన్స్‌, ఆయుర్వేద శాస్త్రం చెబుతున్న ప్ర‌కారం అస‌లు జంట‌లు శృంగారంలో పాల్గొనేందుకు స‌రైన స‌మ‌యం ఏదో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఆయుర్వేద ప్ర‌కార‌మైతే అర్థరాత్రికి ముందుగా శృంగారంలో పాల్గొంటే మంచిద‌ట‌. దాంతో శృంగారానికి, నిద్ర‌కు మంచి స‌మ‌యం ఉంటుంద‌ట‌. ఇక‌ సైన్స్ ప్ర‌కార‌మైతే శృంగారంలో పాల్గొనేందుకు ఏ స‌మ‌యం అనువుగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
 
ఉద‌యం 6 నుంచి 8 మ‌ధ్య‌ : ఈ స‌మ‌యంలో పురుషుల‌కు శృంగార వాంఛ ఎక్కువ‌గా ఉండ‌డ‌మే కాదు, ఆ స‌మ‌యంలో వారి ప‌వ‌ర్ బాగా ఉంటుంద‌ట‌. ఇక్కడ మహిళల విషయంలో పూర్తి విరుద్ధం. 
 
ఉద‌యం 8 నుంచి 10 గంట‌ల మ‌ధ్య‌ : ఈ స‌మయంలో ఎండార్ఫిన్ల‌న‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వ‌డం వల్ల స్త్రీల‌కు శృంగార వాంఛ పెరుగుతుంద‌ట‌. కానీ పురుషుల్లో అదే స‌మ‌యంలో కొంత ఆ వాంఛ త‌గ్గుతుంద‌ట‌. ఇద్దరూ ఇష్టపడితే శృంగారన్ని ఎంజాయ్ చేయొచ్చు. 
 
మ‌ధ్యాహ్నం 12 నుంచి 2 గంట‌ల మ‌ధ్య‌ : ఈ స‌మ‌యంలో స్త్రీ, పురుషులు ఇద్ద‌రికీ బిజీ వర్క్‌లో ఉంటారు. అందువల్ల స్త్రీపురుషులిద్దరూ ఇష్టపడరు. 
 
మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంట‌ల మ‌ధ్య‌ : ఈ స‌మ‌యంలో స్త్రీ ప్రత్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ బాగా ప‌నిచేస్తుంద‌ట‌. అంతేకాదు పురుషుల నుంచి విడుద‌ల‌య్యే వీర్యం కూడా నాణ్య‌మైందిగా ఉంటుంద‌ట‌. క‌నుక ఈ స‌మ‌యంలో శృంగారంలో పాల్గొంటే పిల్లలు క‌లిగేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ ఎక్కువ మంది స్త్రీలు ఈ సమయాన్ని ఇష్టపడరు. 
 
సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మ‌ధ్య‌ : ఈ స‌మ‌యంలో స్త్రీ, పురుషులిద్ద‌రికీ బాగా ఆక‌లి వేస్తుంద‌ట‌. అంతేకాదు, శృంగార వాంఛ‌, ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. క‌నుక ఈ స‌మ‌యం కూడా శృంగారానికి ఏమాత్రం అనుకాదట. 
 
రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు : ఈ స‌మ‌యంలో ఇద్ద‌రిలోనూ శ‌క్తి నిల్వ‌లు పెరిగి శృంగారానికి అనువుగా త‌యార‌వుతార‌ట‌. క‌నుక ఈ సమ‌యం శృంగారానికి అత్యంత అనువైంద‌ట‌.
 
రాత్రి 10 నుంచి 12 గంట‌ల వ‌ర‌కు : స్త్రీ, పురుషులు శృంగారంలో పాల్గొనేందుకు ఇది కూడా అనువైన స‌మ‌య‌మేన‌ట‌. ఎందుకంటే ఆ స‌మ‌యంలో వారి హార్మోన్లు బాగా ఎక్కువగా ప‌నిచేస్తుంటాయ‌ట‌. అయితే, మంచి నిద్రసమయం కావడంతో గ్రామీణ, పట్టణ ప్రాంత స్త్రీలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపరట.