1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. while wakeup in sleeping what we have to do means

రోజూ నిద్రలేచిన తరువాత ఇలా చేస్తే..?

wakeup
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నిద్రలేవగానే గోరువెచ్చని నీరు తాగొచ్చు. కానీ, చాలామంది టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. అది కూడా ఎలాగంటే.. పళ్లు తోమకుండానే.. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలకు దారిచూపినట్టవుతుంది. కనుక ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
 
1. నిద్రించే సమయంలో రక్తప్రసరణ అంతగా జరుగదు. కాబట్టి నిద్రలేచిన తరువాత తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేసినప్పుడు అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోయి.. దాంతో రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
 
2. తరువాత కాలకృత్యాలు తీర్చుకుని పళ్లు తోమాలి. చాలామంది పళ్లు సరిగ్గా తోమరు. దానివలన చిగుళ్ల వాపుగా మారి దంతాల నుండి రక్తం కారుతుంది. దీని కారణంగా ఆహారాన్ని భుజిండానికి కష్టంగా ఉంటుంది. కనుక పళ్లను 3 నిమిషాల పాటు తోమాలి. అప్పుడే వాటిలోని క్రిములు పోతాయి.
 
3. సాధారణంగా చాలామంది ఉదయాన్నే తినకుండానే పాఠశాలకు, కళాశాలకు, ఆఫీసులకు వెళ్తుంటారు. దీని కారణంగా బరువు విపరీతంగా పెరిగిపోతుంది. ఆకలి చచ్చిపోతుంది. ఉదయాన్నే తినే ఆహారమే మీ ఆకలి పెంచుతుంది. అందువలన ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడం మరచిపోవొద్దు.
 
4. ఇటీవలే ఓ అధ్యయనంలో చేసిన పరిశోధనలో సరిగ్గా పళ్లు తోమని వారికి జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. అందువలన రోజూ బ్రష్ చేసే విధంగా కాకుండా మరో కొత్త పద్ధతిలో తోమాలి. అప్పుడే పళ్లల్లోని చెడు బ్యాక్టీయాలు తొలగిపోయి దంతాలు ఆరోగ్యంగా ఉంటారు.    
 
5. ఆ శక్తిని తిరిగి పొందాలంటే.. ఇలా చేయాలి. రోజూ ఉదయాన్నే గ్లాస్ నిమ్మరసం తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.