గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (11:11 IST)

ఆ సమస్యకు అవిసె గింజలు దివ్యౌషధం...

నేటి తరుణంలో ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా వంటల్లో వాడే నూనెలే. అలానే రోజు వారి ఆహారం కోసం తయారుచేసుకునే పదార్థాల్లో ఎలాంటి నూనెలు వాడితే ఆరోగ్యానికి మంచిదనే విషయాన్ని తెలుసుకుందాం..
 
1. అవిసె గింజల నూనె ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. కుష్టు వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అవిసె నూనె చేర్చుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
2. సాధారణంగా వంటలు చేసేటప్పుడు చర్మంపై కాలిన గాయాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవాలంటే.. అవిసె నూనెను ఆ ప్రాంతాల్లో రాసుకోవాలి. దాంతో గాయాల నొప్పి తగ్గుతుంది.
 
3. సీజన్ వేరియేషన్ వలన చాలామందికి జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. అవిసె ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని గ్లాస్ గోరువెచ్చని పాలలో ఈ మిశ్రమాన్ని కలిపి సేవిస్తే ఫలితం ఉంటుంది. 
 
4. చిన్నపిల్లలకు ఆస్తమా ఎక్కువగా వేధిస్తుంటుంది. అందుకు వారి తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక వైద్య చికిత్సలు చేయిస్తుంటారు. అయినా కూడా ఆ సమస్య కాస్త కూడా మెరుగుపడదు. అందువలన ఆయుర్వేదం ప్రకారం ఇస్తే మంచి ఫలితాలు లభిస్తాయి... 
 
5. అవిసె గింజలను రాత్రివేళ నానబెట్టుకుని ఉదయాన్నే వాటిలో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ గింజలను పిల్లలకు ఉదయాన్నే తినిపించినట్లైతే ఆస్తమా వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. 
 
6. ఈ గింజలు తరచుగా తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు అనారోగ్య సమస్యల కూడా దరిచేరవని నిపుణులు సూచన. ఈ గింజల్లోని ఫ్యాటీ యాసిడ్స్ డిప్రెషన్ ‌నుండి ఉపశమనం కలిగిస్తాయి. 
 
7. మహిళలు రుతు సమయంలో వచ్చే నొప్పిలో సతమతమవుతుంటారు. ఆ నొప్పిని తగ్గించాలంటే.. అవిసె గింజలను పొడిచేసుకుని అందులో కొద్దిగా చక్కెర లేదా నిమ్మరసం కలిపి సేవిస్తే నొప్పి తగ్గుతుంది. 
 
8. అవిసె గింజల సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే.. వాటిని దంచి, పొడి చేసి లేదా నూనె రూపంలో తీసుకుంటే మంచిది. ఈ గింజల సూప్ తరుచుగా సేవిస్తే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. 
 
9. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ పదార్థం ఎక్కువగా చేపల్లోనే ఉంటుందని కొందరి భావన. అవిసె గింజల్లో కూడా ఆధికంగా ఉందని పరిశోధనలో తెలియజేశారు. ఈ గింజల్లో ఆహారానికి మాంసాహారంలా ఉపయోగపడుతాయి. 
 
10. ఈ గింజల్లోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. ఈ గింజల్ని మెత్తని పొడిలా చేసి చపాతీ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకుని వాడొచ్చును.