1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (10:20 IST)

కేన్సర్ రోగుల మనుగడ రేటు పెరగాలంటే!

కేన్సర్ వ్యాధిబారిన పడితే జీవితంపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే. అయితే, ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల వీరి మనుగడ రేటు 20 శాతానికి పైగా పెరుగుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. కార్డిఫ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు పలు అధ్యయనాల్ని పరిశీలించడం ద్వారా ఈ అంశాన్ని నిర్ధరించారు. 
 
ఆస్పిరిన్‌ తీసుకోవడం ద్వారా కొన్ని రకాల కేన్సర్లు తగ్గుతాయనే విషయంలో గణనీయమైన ఆధారాలున్నాయని పరిశోధకులు పీటర్‌ ఎల్‌వుడ్‌ పేర్కొన్నారు. పేగులు, రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రోగులు, తాము పొందుతున్న చికిత్సతోపాటు తక్కువ మోతాదుల్లో ఆస్పిరిన్‌ తీసుకోవడం ద్వారా మరణాల రేటు 15 నుంచి 20 శాతం దాకా తగ్గినట్లు తేలిందనీ, క్యాన్సర్‌ వ్యాప్తికూడా తగ్గుతున్నట్లు వివరించారు.