హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో కేవలం హిందువులే లక్ష్యంగా దాడులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, వీటికి అధికార టీఎంసీ నేత మొహబూబ్ ఆలం సూత్రధారి అని కోల్‌కతా హైకోర్టు నియమించిన విచారణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో చెలరేగిన ఈ దాడులు ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని, బాధితులు సహాయం కోసం అభ్యర్థించినప్పటికీ స్థానిక పోలీసుల స్పదించడంలో విఫలమయ్యారని నివేదిక పేర్కొంది.
ముర్షిదాబాద్‍లో జరిగిన హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ దాడులకు స్థానిక కౌన్సిలర్, తృణమూల్ కాంగ్రెస్ నేత మెహబూబ్ ఆలం సూత్రధారి అని నివేదిక ఆరోపించింది. స్థానిక కౌన్సిలర్ మెహబూబ్ ఆలం దుండగులతో కలిసి వచ్చి ఈ దాడులకు పాల్పడ్డారు. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఘటనా స్థలంలో వారి జాడ కనిపించలేదు అని నివేదికలో కమిటీ స్పష్టం చేసినట్టు ఆంగ్ల మీడియా పేర్కొంది.