దీర్ఘకాలి మూత్రపిండాల వ్యాధి (సీకెడీ) ఇప్పుడు అంతర్జాతీయంగా అతి ముఖ్యమైన దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా నిలుస్తుంది. దీనికి, ప్రపంచవ్యాప్తంగా మధుమేహం మరియు హైపర్‌టెన్షన్ (పెరుగుతున్న రక్తపోటు) కేసులు పెరుగుతుండటం ముఖ్యకారణం. భారతదేశంలో సీకెడీ తీవ్రత 17.2%గా ఉంటుందని అంచనా. నూరుకోట్ల మందికి పైగా జనాభా కలిగిన భారతదేశంలో వృద్ధి చెందుతున్న సీకెడీ రోగులు, అటు ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటుగా ఇటు రాబోయే సంవత్సరాలలో ఆర్ధికవ్యవస్థకు సైతం అతి ప్రధాన సమస్యగా నిలిచే అవకాశాలున్నాయి.
సుప్రసిద్ధ సైన్స్ ఆధారిత బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా ఇండియా (ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్), నేడు తమ తాజా మధుమేహ ఔషదం, డపాగ్లిఫ్లాజిన్ యొక్క క్లీనికల్ ట్రయల్స్ పూర్తి ఫలితాలను వెల్లడించింది. టైప్ 2 మధుమేహం లేదా మధుమేహంతో మాత్రమే బాధడుతున్న రోగులలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు (సీకెడీ) తీవ్రతను తగ్గించడంలో ఈ ఔషదం చక్కటి ప్రయోజనాలను చూపింది. అత్యున్నత యాంటీ –డయాబెటిక్ మరియు హార్ట్ ఫెయిల్యూర్ ప్రయోజనాలను మించి ఈ సీకెడీ ప్రయోజనాలను కలిగి ఉంది.
దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులంటే అర్థం, మూత్రపిండాలు చెడిపోవడంతో పాటుగా రక్తాన్ని సక్రమంగా వడపోయాల్సిన తన బాధ్యతను అవి సక్రమంగా నిర్వర్తించవు. ఈ వ్యాధిని క్రానిక్‌గా పిలువడానికి కారణమేమిటంటే, దీర్ఘకాలంలో మూత్రపిండాలకు నష్టం నెమ్మదిగా జరుగుతుండటం. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల కారణంగా సంభవించే ఇతర ఆరోగ్య సమస్యలలో గుండె వ్యాధులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా మూత్రపిండాల వ్యాధి ఉంటే, స్ట్రోక్ లేదంటే గుండె ఫెయిల్యూర్ అయ్యేందుకు అవకాశాలు సైతం వారికి అధికంగా ఉంటాయి. మూత్రపిండాల వ్యాధికి అధిక రక్త పోటు ఓ కారణం మరియు దాని ఫలితంగానే మూత్రపిండాల వ్యాధులు అధికంగా సంభవించనూ వచ్చు.
దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల తొలి దశలో, వ్యక్తులకు కొన్ని రకాల లక్షణాలు లేదా గుర్తులు కనిపిస్తుంటాయి. వాటిలో పాదాలు మరియు మోకీళ్లు వాయడం, కండరాలు పట్టేయడం, వికారం, వాంతులు మరియు ఆకలి లేకపోవడం కనిపిస్తాయి. అయితే, మూత్రపిండాల పనితీరు గణనీయంగా బలహీన పడే వరకూదీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి స్పష్టంగా కనిపించకపోవచ్చు. సెరమ్ క్రియాటిన్, బ్లడ్ యూరియా, యూరిన్ అల్బుమిన్ లాంటి పరీక్షలు చేయడం ద్వారా ఆ వ్యక్తులు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో గమనించడం జరుగుతుంది.
ఒకసారి నిర్ధారణ జరిగిన తరువాత, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి చికిత్సలో భాగంగా మూత్రపిండాలకు జరిగే నష్టాన్ని నెమ్మది చేయడంపై దృష్టి సారిస్తారు. సాధారణంగా దీనికి ప్రధానకారణమైన కారణాన్ని నియంత్రించడం ద్వారా దానిని సాధ్యం చేస్తారు. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, తుది దశ కిడ్నీ ఫెయిల్యూర్‌గా అభివృద్ధి చెందుతుంది. డయాలిసిస్ లేదా మూత్రపిండాల మార్పిడి కూడా ఈ స్థితిలో సాధ్యపడక ప్రాణాంతికం కావొచ్చు. మూత్రపిండాల వ్యాధి కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలైనటువంటి గుండె విఫలం కావడం, కార్డియోవాస్క్యులర్ డెత్ మొదలైనవి సంభవించవచ్చు.
విప్లవాత్మక మూడవ దశ దాపా-సీకెడీ ట్రయల్ యొక్క సవివరమైన ఫలితాలు చూపేదాని ప్రకారం డపాగ్లిఫ్లోజిన్‌తో పాటుగా ప్రామాణికమైన సంరక్షణతో మూత్రపిండాల పనితీరు చెడిపోకుండా అడ్డుకోవడంతో పాటుగా దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి(సీకెడీ)తో బాధపడుతున్న రోగులలో ప్లాసెబోతో పోల్చినప్పుడు కార్డియోవాస్క్యులర్ (సీవీ) లేదా మూత్రపిండాల వల్ల మరణాలను 39% వరకూ తగ్గించడం వీలవుతుంది. ఈ ఫలితాలు టైప్ 2 మధుమేహం(టీ2డీ)తో బాధపడుతున్న లేదా అది లేకుండా ఉన్న రోగులలో స్థిరంగా కనిపిస్తున్నాయి.
డాక్టర్ అనిల్ కుక్రేజా, వైస్ ప్రెసిడెంట్- మెడికల్ ఎఫైర్స్ అండ్ రెగ్యులేటరీ, అస్ట్రాజెనెకా ఇండియా మాట్లాడుతూ, ‘‘మారిన జీవనశైలి, పెరిగిన ఆయుర్దాయం మరియు అంటువ్యాధులేతర వ్యాధుల ప్రాబల్యం కారణంగా, భారతదేశంతో సహా అల్పాదాయ మరియు మధ్య తరహా ఆదాయం కలిగిన దేశాలలో ఒకే రీతిన మూత్రపిండాల వ్యాధుల ప్రభావం కనబడుతుంది. ప్రస్తుతం అందుబాటులో చికిత్సలున్నప్పటికీ, సీకెడీని ప్రభావవంతంగా నిర్వహించే చికిత్సల అవసరం అంతర్జాతీయంగా కనబడుతుంది.
డాపా- సీకెడీ ట్రయల్‌లో సీకెడీతో బాధపడుతున్న 201 మంది భారతీయ రోగులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా నిర్వహించిన ఈ క్లీనికల్ అధ్యయనంలో మొత్తంమ్మీద 4304 రోగులు పాల్గొన్నారు. సీకెడీతో బాధపడుతున్న రోగులలో అత్యుత్తమ ప్రయోజనాలను గమనించడం జరిగింది. టైప్ 2 మధుమేహులలో ప్రభావవంతంగా డపాగ్లిఫ్లోజిన్ పనిచేస్తుందని తేలింది, అలాగే ఎంపిక చేసిన గుండె ఫెయిల్యూర్ రోగులలోనూ ప్రభావవంతమైన పనితీరును ప్రదర్శించే ఈ ఔషదం ఇప్పుడు సీకెడీ రోగులలోనూ ఆ ప్రభావతను చూపుతుంది’’ అని అన్నారు.
డాక్టర్ మనీష్ సహాయ్, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ నెఫ్రాలజీ- ఉస్మానియా మెడికల్ కాలేజీ మరియు ఉస్మానియా జనరల్ హాస్పిటల్- హైదరాబాద్ మాట్లాడుతూ, ‘‘ భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు (సీకెడీ) భారం గణనీయంగా పెరుగుతుంది. దురదృష్టవశాత్తు మూత్రపిండాల వ్యాధులను నిర్థారించడంలో జరిగే ఆలస్యం కారణంగా ఈ సీకెడీతో బాధపడుతున్న రోగులను ముందుగా గుర్తించడమూ జరుగడం లేదు. చాలావరకూ కేసులలో మూత్రపిండాల వ్యాధులలో ఎలాంటి లక్షణాలూ కనబడుకపోవడం చేత స్ర్కీనింగ్ అనేది అతి ముఖ్యం. దీని కారణంగానే ముందుగానే ఈ మూత్రపిండాల వ్యాధులను గుర్తించడం జరుగుతుంది. ముందుగానే ఏసీఈఐ/ఏఆర్‌బీ మరియు ఎస్‌జీఎల్‌టీ2 ఇన్హిబిటర్లు అయినటువంటి డపాగ్లిఫ్లోజిన్‌ను వినియోగించడమనేది మూత్రపిండాల రక్షణకు ప్రయోజనకారిగా కనిపిస్తుంది’’ అని అన్నారు.
డాక్టర్ బిపిన్ సేథీ, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్-కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్- హైదరాబాద్ మాట్లాడుతూ, ‘‘మొత్తంమ్మీద సీకెడీ వ్యాధి తీవ్రతకు మధుమేహం గణనీయమైన తోడ్పాటును అందిస్తుంది. హైపర్‌టెన్షన్ మరియు సంబంధిత గుండెవ్యాధులు ఈ పరిస్థితిని మరింతగా దిగజారుస్తాయి మరియు గుండె, సీకెడీ నడుమ ప్రతికూలతలు చాలానే ఉన్నాయి. మూత్రపిండాలను కాపాడే ఔషధాలు అతి తక్కువగా మాత్రమే ఉన్నాయి. సంప్రదాయంగా చక్కటి గ్లైసెమిక్ మరియు బీపీ నియంత్రణ(ఔషధాలు రాస్ వ్యవస్థను నియంత్రిస్తాయి) ద్వారా మూత్రపిండాలను రక్షించుకోవడం సాధ్యమవుతుంది.
తమ వినూత్నమైన స్వతంత్య్ర ప్రతిస్పందిత చర్యల ద్వారా ఎస్‌జీఎల్‌టీ-2ఐ, గ్లూకోజ్‌పై ప్రభావవంతంగా పనిచేయడంతో పాటుగా తొలుత మూత్రపిండాల రక్షణకు వాగ్దానం చేస్తుంది. ఇది కేవలం మధుమేహులతో పాటుగా మధుమేహేతురులపై కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గుండెపై సైతం ఇవి ప్రయోజనకారిగా ఉండటంతో పాటుగా వ్యాధి బారిన పడిన గుండె, మూత్రపిండాల నడుమ సంబంధాలను పరిష్కరిస్తుంది’’ అని అన్నారు. మధుమేహంతో బాధపడుతున్న మరియు మధుమేహం లేని పెద్దవారిలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి చికిత్సలో గణనీయమైన ప్రయోజనాలను చూపుతున్న ఒకే ఒక్క ఇన్హిబిటర్ ఎస్‌జీఎల్‌టీ2.