బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:30 IST)

కరోనా బాధితుల కోసం తన కార్యాలయాన్ని ఐసియూగా మార్చిన షారూక్ ఖాన్

కరోనా సమయంలో చాలామంది హీరోలు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కూడా ఒకరు. ముంబై లోని తన కార్యాలయాన్ని కరోనా బాధితుల కోసం ఐసీయుగా మార్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించారు.
 
అందులో అక్షయ్, సోనూ సూద్ వంటి వారు కరోనా కష్టకాలంలో ఎంతోమందిని ఆదుకున్నారు. షారుక్ ఖాన్ తన స్టార్‌డమ్‌ను సరైన విషయాల కోసం ఉపయోగించటానికి ఎప్పుడు ముందువరుసలో ఉంటాడు. షారూక్ తన కార్యాలయంలో 15 పడకల ఐసియును ఏర్పాటు చేశారు. దీంతో 66 మంది కరోనా బాధితులను అక్కడ చేర్చారు.
 
వారిలో 54 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. షారూక్ ఖాన్ యొక్క మీర్ పౌండేషన్, హిందుజా హాస్పిటల్ మరియు బిఎంసి సహకారంతో 15 పడకల ఐసియు సిద్ధమయ్యింది. ఖార్ లోని హాస్పిటల్లో లిక్విడ్ ఆక్సిజన్ నిల్వ ట్యాంకులను కలిగి వుందని, వెంటిలేటర్, ఆక్సిజన్ లైన్లతో క్లిష్టమైన రోగులకు సేవలు అందిస్తున్నామని ఖార్ లోని హిందుజ హాస్పిటల్ డాక్టర్ అవినాష్ తెలిపారు.