శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 11 ఆగస్టు 2020 (15:19 IST)

అఖిల్.. నెక్ట్స్ మూవీ మెగా డైరెక్టర్‌తో ఫిక్స్, త్వరలోనే ఎనౌన్స్‌మెంట్..!

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే మూవీ చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ కొంత టాకీ ఓ పాట బ్యాలన్స్ ఉంది. బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
ఇదిలా ఉంటే... అఖిల్ నెక్ట్స్ మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తునే ఉన్నాయి. తమిళ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరిగింది. ఇటీవల సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో అఖిల్ సినిమా కన్ఫర్మ్ అంటూ టాలీవుడ్లో టాక్ వినిపించింది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించనున్నట్టు.. త్వరలో ప్రకటిస్తారని టాక్ వచ్చింది.
 
అయితే... తాజా వార్త ఏంటంటే... అఖిల్ తదుపరి చిత్రాన్ని స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇటీవల సురేందర్ రెడ్డి అఖిల్‌కి కథ చెప్పడం.. ఆ కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. అయితే... ఈ మూవీని ఎవరు నిర్మించనున్నారు అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారని టాక్.