శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 10 మార్చి 2017 (04:39 IST)

కాపీ తాగితే ఉన్న మతి పోదు కానీ వెర్రిని తగ్గిస్తుందట..

రోజులో మనం తాగే కప్పు కాఫీ కానీ, టీ కానీ మీలోని చిత్త వైకల్యాన్ని అదుపులో ఉంచుతుందని తాజా పరిశోధనలు చాటుతున్నాయి.

రోజులో మనం తాగే కప్పు కాఫీ కానీ,  టీ కానీ మీలోని చిత్త వైకల్యాన్ని అదుపులో ఉంచుతుందని తాజా పరిశోధనలు చాటుతున్నాయి. మెదడులోని అవకతవకలను తగ్గించే ఎంజైమ్ (రసాయనిక ఆమ్ల ద్రవం)ను పెంచే శక్తి కాఫీలోని కెఫీన్‌కు ఉందని ఇలాంటి 24 రసాయనిక సమ్మేళనాలు మెదడు వైక్యల్యానికి గురి కాకుండా అడ్డుకుంటున్నాయని ఇండియానా యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు.
 
మెదడులోని ఎంజైమ్ ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేసే అంశాలను కనుగొనడానికి ఈ పరిశోధకులు 1,280 రసాయనిక సమ్మేళనాలపై పరిశోధన చేశారు. వీటిలో 24 రసాయనాలు ఎంజైమ్‌ వృద్ధికి దోహదపడుతున్నాయని, వాటిలో కెఫీన్ కూడా ఒకటని వీరు కనుగొన్నారు. ఈ ఎంజైమ్ మెదడులో రెండు పాత్రలు పోషిస్తోంది. ఒత్తిడి నుంచి మెదడు నరాలను కాపాడటం. దారితప్పిన ప్రొటీన్‌లను ఎదుర్కోవడం. దారి తప్పిన ప్రొటీన్లు వృద్దావ్యంలో  మనిషికి చిత్తచాంచల్యం కలిగిస్తాయని వీటి నిరోధించే గుణం మనం తాగే కాఫీలో ఉంటుందని చెబుతున్నారు. 
 
ఈ పరిశోధన ఫలితంతో మెదడులో ఎంజైమ్‌ స్థాయిలను పెంచే ఔషధాలను అభివృద్ధి చేయడంలో ముందంజ వేయవచ్చని ఇండియనా పరిశోధకులు వెల్లడించారు.