శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 11 జులై 2016 (19:07 IST)

చిన్నారులు అదేపనిగా టీవీ, స్మార్ట్‌ఫోన్లు చూస్తే...

చిన్నారులు అదేపనిగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. అదేపనిగా డిజిటల్ స్క్రీన్‌లు చూస్తూ ఈ సిండ్రోమ్ బారిన పడి వైద్యులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య వి

చిన్నారులు అదేపనిగా టీవీలు, స్మార్ట్‌ఫోన్లు చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటున్నారు. అదేపనిగా డిజిటల్ స్క్రీన్‌లు చూస్తూ ఈ సిండ్రోమ్ బారిన పడి వైద్యులను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుందట. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు ఈ సమస్యతో బాధపడుతున్నారని చెబుతున్నారు. 
 
డిజిటల్ స్క్రీన్‌లలో వాడే బ్లూ లైట్ వల్ల ఇలా అవుతుందట. అన్నిటినీ మించి స్మార్ట్ ఫోన్లను, టీవీలను, కంప్యూటర్లను చీకటిలో అసలే చూడకూడదట. ఎక్కువ సేపు ఇలా చూస్తే పాక్షిక అంధత్వం కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. మీ చిన్నారులు జాగ్రత్త సుమీ!