ఎయిడ్స్‌ని సమర్థంగా ఎదుర్కొనే టీకా.. హెచ్ఐవీ రోగుల నుంచే...
హెచ్ఐవీ రోగులకు శుభవార్త. హెచ్‌ఐవీపై సమర్థంగా పోరాడే కొత్తరకం టీకాను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఎయిడ్స్ రోగుల్లో సహజంగానే ఉత్పత్తి అయ్యే ప్రతిరక్షక కణాల నుంచి దీన్ని అభివృద్ధి చేయడం గమనార్హం. అమెరికాలోని ది స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, జొల్లా ఇనిస్టిట్యూట్ ఫర్ అలర్జీ అండ్ ఇమ్యునాలజీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వాక్సిన్ ఇనీషియేటివ్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ టీకాని రూపొందించడంలో తలనమునకలయ్యారు.
మనుషుల్లో సహజంగానే హెచ్‌ఐవీ వైరస్‌పై పోరాడే ప్రతిరక్షక 'బి' కణాలుంటాయి. శాస్త్రవేత్తలు రూపొందించిన టీకా వీటిని సమర్థంగా పనిచేసేలా ప్రేరేపించడమేకాకుండా, కొత్త కణాలు ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యవంతులైన రక్తదాతల నుంచి సేకరించిన బీ కణాల నుంచి 'వీఆర్‌సీ01-క్లాస్' అనే ప్రతిరక్షక కణాలను అభివృద్ధి చేశామని వారు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.