బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 7 జులై 2023 (23:55 IST)

మహమ్మారి అనంతర కాలంలో ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయని నివేదించిన భారతీయులు

image
భారతదేశంలోని బేయర్స్ కన్స్యూమర్ హెల్త్ డివిజన్ నుండి నెం.1 తలనొప్పి నివారణ బ్రాండ్ సారిడాన్ తన జాతీయ తలనొప్పి సర్వే యొక్క రెండవ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ సమగ్ర నివేదిక కోవిడ్ మహమ్మారి అనంతర కాలంలో వ్యక్తులలో పెరుగుతున్న ఒత్తిడిని పరిశీలించింది. విభిన్న భౌగోళికాలు, జనాభాలో తలనొప్పితో దాని సహసంబంధాన్ని అన్వేషించింది.  
 
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పూర్తి-సేవల మార్కెట్ పరిశోధన సంస్థ అయిన HANSA రీసెర్చ్ చేత నిర్వహించబడిన సమగ్ర నివేదిక, వ్యక్తులు ఎదుర్కొనే ఒత్తిడి స్థాయిలపై సమగ్ర అవగాహనను అందించడానికి భారతదేశంలో 22-45 సంవత్సరాల వయస్సు వర్గాలలోని వ్యక్తులలో లింగం, శ్రామిక వర్గం, వయస్సు, జనాభాతో సహా అనేక రకాల సమన్వయాలను పరిశోధించింది. ఈ విస్తృతమైన అధ్యయనం 20 పట్టణ, నగరాల నుండి 5,310 మంది స్పందనదారులను కలిగి ఉంది. ఇందులో 15 రాష్ట్రాల్లోని కీలకమైన టైర్ 1, టైర్ 2 పట్టణాలకు చెందిన వ్యక్తులు కూడా  వున్నారు. ఈ నివేదిక ప్రకారం, తలనొప్పిని అనుభవించిన స్పందనదారులలో ఆశ్చర్యపరిచే రీతిలో 93% మంది గుర్తించదగిన పెరుగుదలను చూశారు. ఇది నేరుగా పెరిగిన ఒత్తిడి స్థాయిలతో ముడిపడి ఉంది.
 
మహమ్మారి తర్వాత వారి ఒత్తిడి స్థాయిలు పెరిగినట్లు ప్రతి ముగ్గురిలో ఒకరు భావించినట్లు నివేదిక వెల్లడించింది. పని చేసే, పని చేయని జనాభా రెండింటికీ ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి ప్రధాన ఒత్తిళ్లుగా సూచించబడ్డాయి. ఇతర కారణాలతోపాటు, ఆరోగ్య సమస్యలు- కుటుంబ కలహాలు వంటివి సాధారణంగా కనిపిస్తున్నాయి. మహమ్మారి అనంతర ప్రపంచంలో సమర్థవంతమైన ఒత్తిడి నిర్వహణ వ్యూహాల అవసరాన్ని ఈ పరిశోధనలు ప్రధానంగా వెల్లడించాయి. 
 
‘ఈ నూతన సారిడాన్ తలనొప్పి నివేదిక’ గురించి బేయర్ కన్స్యూమర్ హెల్త్ ఇండియా కంట్రీ హెడ్, సందీప్ వర్మ మాట్లాడుతూ, “బేయర్‌లో, మేము స్వీయ-సంరక్షణకు ప్రాధాన్యతనిస్తాము. మా మిషన్‌లో అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను ముందంజలో ఉంచుతాము. తాజా నివేదిక ఒత్తిడి మరియు తలనొప్పి మధ్య ముఖ్యమైన సంబంధాన్ని నొక్కి చెబుతుంది, ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలంలో వినియోగదారులు ఇప్పుడు వారి శ్రేయస్సు యొక్క ముఖ్యమైన అంశంగా స్వీయ-సంరక్షణపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.
 
50 సంవత్సరాలకు పైగా వారసత్వంతో, సారిడాన్ భారతీయ వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించుకుంది, దానికదే ఇంటి పేరుగా స్థిరపడింది. ఈ నివేదిక ఒత్తిడి, తలనొప్పి మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతుంది. ఎందుకంటే ఇది వినియోగదారుల యొక్క మారుతున్న ఆరోగ్య సంరక్షణ అవసరాలను కూడా వెల్లడిస్తుంది. మా బ్రాండ్‌లను అభివృద్ధి చేయడం ద్వారా, న్యూ సారిడాన్ లా మా అత్యుత్తమ పరిష్కారాలను పరిచయం చేయడం ద్వారా రోజువారీ అవసరాలను తీర్చడం కోసం అధునాతన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి బేయర్ కట్టుబడి ఉంది" అని అన్నారు.
 
టియర్ 1 పట్టణాలలో, 90% కంటే ఎక్కువ తలనొప్పి ఉన్న ఏకైక నగరం ముంబై అయితే చెన్నై 89% వద్ద దగ్గరగా ఉంది. టియర్ 2 పట్టణాలలో, అహ్మదాబాద్, భువనేశ్వర్‌లలో 99% మంది తలనొప్పిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు, తర్వాత మధురై, ఇండోర్ ఉన్నాయి. ఈ నివేదిక వెల్లడించే దాని ప్రకారం 80% మంది స్పందనదారులు ఇప్పుడు తమ తలనొప్పుల గురించి కుటుంబం, స్నేహితులు- సహోద్యోగులతో చర్చించటానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు . 2021 అధ్యయనంతో పోలిస్తే, రోజు చివరి వరకు వేచి ఉండకూడదనుకునే వారితో  పోలిస్తే (2021లో 86%) తలనొప్పి నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని నిమిషాలు లేదా గంటలలోపు చర్య తీసుకునే వ్యక్తుల సంఖ్య(89%)లో 3% గణనీయమైన పెరుగుదల కనిపించింది. 
 
ఈ ఫలితాలు ఆందోళనకరమైన ట్రెండ్‌ను కూడా ఆవిష్కరించాయి. దాదాపు 40% మంది స్పందనదారులు తమ పనులపై సరైన ఏకాగ్రతను కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నామని సూచిస్తున్నారు. 2021 అధ్యయనం యొక్క ఫలితాలతో పోలిస్తే 7% గణనీయమైన పెరుగుదల ఇది. దాదాపు 50% మంది ఈ ఆందోళనను పరిష్కరించడానికి ప్రాథమిక నివారణగా వృత్తిపరమైన బాధ్యతలు, ఇంటి పనులు రెండింటిలో పనిభారాన్ని తగ్గించుకోవడాన్ని హైలైట్ చేశారు. 2021లో సారిడాన్ తలనొప్పి నివేదికలో భాగంగా నిర్వహించిన లోతైన విశ్లేషణ పట్టణ భారతీయులలో తలనొప్పి ఫ్రీక్వెన్సీని పెంచే ధోరణిని కనుగొంది.