మీరు తెలివిగలవారా కాదా...? గుడ్లగూబలా రాత్రివేళల్లో మేల్కొంటే...?
తెలివి ఎవడబ్బ సొత్తు. ఎవరి తెలివి వారి సొంతం. ఎవరి తెలివి ఎంత అని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా వారు వెల్లడించిన వివరాలను ఒకసారి తెలుసుకుందాం. సహజంగా చాలామంది రాత్రి 8 గంటలు దాటగానే ఆవలిస్తూ అన్
తెలివి ఎవడబ్బ సొత్తు. ఎవరి తెలివి వారి సొంతం. ఎవరి తెలివి ఎంత అని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూనే ఉంటారు. తాజాగా వారు వెల్లడించిన వివరాలను ఒకసారి తెలుసుకుందాం. సహజంగా చాలామంది రాత్రి 8 గంటలు దాటగానే ఆవలిస్తూ అన్నం తినేసి భేషుగ్గా నిద్ర లాగించేస్తారు. ఉదయాన్ని ఉబ్బు ముఖంతో లేచి తదుపరి కార్యక్రమాలను మొదలెడతారు. కొందరు గుడ్లగూబలా అర్థరాత్రి దాటినా ఏదో పుస్తకం చదువుతూనో, ఇంకా కంప్యూటర్ వంటి సాధనాలతో కుస్తీ పడుతూనే కాలక్షేపం చేస్తుంటారు.
అర్థరాత్రి 12 దాటితే గానీ వీరికి నిద్రపట్టదు. ఇంకా చెప్పాలంటే రాత్రిపూట నిండు చంద్రుడు ఆకాశంలో కనబడితే వీరు అస్సలు నిద్రపోరు. ఏవో ఆలోచనలతో షికారు చేస్తుంటారు. అలా 12 గంటలు దాటాక పడకపైకి ఎక్కి అప్పుడు నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా గుడ్లగూబలా రాత్రివేళల్లో మేల్కొని ఉండేవారు చాలా తెలివిగా ఉంటారని అమెరికాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్సుకు చెందిన మానసిక వేత్త సంతోషి ఎన్నో పరిశోధనలు చేసిన పిదప ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొన్నారు.