శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 జూన్ 2016 (13:17 IST)

ముద్దు పెట్టుకుంటే నడిచినట్టే.. సెక్స్ చేస్తే పరుగెత్తినట్టే... గుండెజబ్బు రోగులకు కొత్త ఔషధం శృంగారం!

సాధారణంగా గుండె జబ్బుతో బాధపడేవారు శృంగారానికి దూరంగా ఉంటుంటారు. అలా వుండమని కూడా వైద్యులు సలహా ఇస్తుంటారు. అయితే, వీరు శృంగారానికి దూరంగా ఉండటం తప్పు అని బ్రెజిల్లోని రియో డీ జెనీరియో హార్ట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెపుతున్నారు. అంతేకాకుండా, గుండె జబ్బుతో బాధపడేవారి కోసం ఓ కొత్త ఔషధాన్ని వారు కనిపెట్టారు కూడా. 
 
ఆ ఔషధమే సెక్స్ (శృంగారం). గుండె జబ్బులతో బాధపడేవారు వారానికి కనీసం మూడునాలుగు సార్లు అంటే రోజువిడిచి రోజు సెక్స్‌లో పాల్గొంటే మంచిదని చెపుతున్నారు. భాగస్వామిని ముట్టుకోవడం ఓ నడక లాంటిదని, ముద్దు పెట్టుకోవడం వడివడిగా నడవడం లాంటిదని, శృంగారంలో పాల్గొనడం పరుగెత్తడం వంటిదని ఈ పరిశోధకులు చెపుతున్నారు. 
 
నడవడం, పరుగెత్తడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో శృంగారం వల్ల కూడా అన్ని ప్రయోజనాలు ఉంటాయన్నది వారి వివరణగా ఉంది. ఇక ఆరు నిమిషాల పాటు సెక్స్‌లో పాల్గొంటే గుండెతోపాటు శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని, 21 క్యాలరీలు శక్తి కరిగిపోతుందట. సెక్స్‌కు, గుండెకు ఉన్న సంబంధంపై జరిపిన 150 అధ్యయనాలను పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించినట్టు వారు పేర్కొన్నారు.