శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (15:39 IST)

కోరలు విప్పిన స్వైన్‌ఫ్లూ... హైదరాబాద్‌లో ఇద్దరు మృతి

హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ కోరలు విప్పింది. ఫలితంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో గాలిలో తేమ వాతావరణం కారణంగా ప్రస్తుతం ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఒకరి నుం

హైదరాబాద్ నగరంలో స్వైన్ ఫ్లూ కోరలు విప్పింది. ఫలితంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లో గాలిలో తేమ వాతావరణం కారణంగా ప్రస్తుతం ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి సోకే వ్యాధి కావడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది.
 
ఈ యేడాది ఇప్పటికే 23 కేసుల్లో 17 కేసులు ఒక్క సెప్టెంబరు నెలలోనే నమోదు కావడం విశేషం. వీరందరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత నెలలో మూడు కేసులు నమోదు కాగా, వీరిలో ఒక మహిళ గాంధీ ఆస్పత్రికి రావడంతో చికిత్స పొందుతూ చనిపోయింది. 
 
కాగా, తొమ్మిదేండ్ల క్రితం వాతావరణంలోకి ప్రవేశించిన ఈ ఫ్లూ వైరస్‌ అనేక మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. అప్పట్లో వివిధ ఆస్పత్రుల్లో ప్రభుత్వం ప్రత్యేక వార్డులను సైతం ఏర్పాటు చేసి చికిత్స అందించింది. రెండేండ్లుగా ఫ్లూ ఆనవాళ్లు కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ స్వైన్‌ ఫ్లూ పంజా విసరడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.