గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (16:40 IST)

'అరవింద సమేత' ప్రీ రిలీజ్‌ వేడుకకు అంతా సిద్ధం.. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". చాలా యేళ్ల తర్వాత తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని పూర్తి స్థా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". చాలా యేళ్ల తర్వాత తన మాస్ ఇమేజీకి తగ్గట్టుగా ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి యాక్షన్ మూవీగా చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తోన్న ఓ వార్త ఇపుడు ఎన్టీఆర్ అభిమానులను తెగ ఉత్సాహపరుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ డ్యుయెల్ రోల్ చేస్తున్నాడట.
 
ఇటు తండ్రిపాత్రలోనూ.. అలాగే అటు కొడుకు పాత్రలోనూ ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా తండ్రి పాత్ర సరసన నటించందని సమాచారం. ఎన్టీఆర్ అభిమానులను థ్రిల్ చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే.. చిత్రబృందం ఈ విషయాన్ని బయటపెట్టలేదట. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 
 
మరోవైపు ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఎన్టీఆర్ సరసన హాట్ భామ పూజా హెగ్డే నటించగా ఈషా రెబ్బా కీలక పాత్రలో నటించింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఈ నెల 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ నేపథ్యంలో రేపు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నోవాటెల్ వేదిక‌గా జ‌రిగే ఈ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా జగపతిబాబు, నాగబాబులతో పాటుగా సునీల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ 'అరవింద సమేత'పై భారీ అంచనాలే నెలకొనివున్నాయి.