గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (16:05 IST)

మగాళ్లు తుస్ మంటున్నారు.. ఆడోళ్లు రెచ్చిపోతున్నారు.. ఎందులో?

సాధారణంగా అన్ని రంగాల్లో మగాళ్లు ముందుంటారు. కానీ, ఇటీవలికాలంలో పురుషులతో స్త్రీలు కూడా పోటీపడుతున్నారు. శృంగారం మొదలుకుని, మద్యం సేవించే విషయం వరకు మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మహిళలు నిరూపిస్తున్నారు.

సాధారణంగా అన్ని రంగాల్లో మగాళ్లు ముందుంటారు. కానీ, ఇటీవలికాలంలో పురుషులతో స్త్రీలు కూడా పోటీపడుతున్నారు. శృంగారం మొదలుకుని, మద్యం సేవించే విషయం వరకు మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని మహిళలు నిరూపిస్తున్నారు. తాజాగా వెల్లడైన ఓ అధ్యయన ఫలితాలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఆ రంగంలో మగాళ్ల కంటే స్త్రీలే ఒక అడుగు ముందున్నారట. ఇంతకీ మహిళలు ఏ రంగంలో ముందున్నారనే కదా మీ సందేహం. మద్యం సేవించడంలో మగాళ్లను స్త్రీలు మించిపోయారట. 
 
తాజాగా దేశంలో మద్యం తాగే మహిళల సంఖ్య పెరిగినట్టు జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడైంది. మందు తాగే మహిళలు ఎక్కువగా ఉన్న జాబితాలో 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం. సుమారు 10 యేళ్ల తర్వాత మద్యం తాగే మహిళల సంఖ్య 0.7 శాతానికి పెరగగా, మద్యం సేవించే పురుషుల శాతం 24.7 కు తగ్గినట్టు సర్వేలో వెల్లడైంది.
 
అంటే, గత 2005-2006వ సంవత్సరంలో మద్యం సేవించే మహిళల శాతం 0.4గా ఉండగా, ఇది 2015-2016 నాటికి వీరి శాతం 0.7 శాతానికి పెరిగింది. అదీకూడా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, గోవా, కేరళ, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళలు అధికంగా మద్యం సేవిస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. 
 
అదేసమయంలో 2005-2006 లో మద్యం సేవించే పురుషుల శాతం 33.1 శాతంగా ఉండగా, 2015-2016 నాటికి  24.7 శాతానికి తగ్గిపోయిందనీ ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో తాగే మహిళల శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడో విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. దేశ రాజధాని ఢిల్లీలో అయితే, మద్యం సేవించే మహిళలకు ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ కూడా ఉందట. ఆ యాప్‌కు 'శక్తి' అనే పేరు పెట్టినట్టు సమాచారం.