ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 జూన్ 2022 (17:08 IST)

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం: సురక్షితమైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం

మే 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. ఈ ఏడాది 2022 థీమ్ ఏంటంటే... 'సురక్షితమైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం'. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ థీమ్‌ను ప్రకటించింది. సురక్షితమైన ఆహారం మెరుగైన మానవ ఆరోగ్యానికి కీలకం అనే వాస్తవాన్ని నొక్కి చెబుతుంది. 

 
గాలిలో వ్యాపించే వ్యాధులను గుర్తించడం, నిర్వహించడం, నివారించడంతోపాటు మానవ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తారు. సురక్షితమైన ఆహారం ప్రయోజనాలను జరుపుకోవడానికి డిసెంబర్ 20, 2018న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార- వ్యవసాయ సంస్థ (FAO) సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి.

 
ఆహారం ద్వారా వచ్చే వ్యాధులు సాధారణంగా అంటువ్యాధిగానో లేదా విషపూరితమైన స్వభావం కలిగి ఉంటాయి. ఇవి కొన్నిసార్లు కంటికి కనిపించవు. అవి మనం తీసుకునే కలుషితమైన ఆహారం లేదా పానీయాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సురక్షితమైన ఆహారం ప్రాథమికమైనది. ఉత్పత్తి నుండి హార్వెస్టింగ్, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ నుంచి చివరకు తయారీ, వినియోగం వరకు, ఆహార గొలుసులోని అన్ని దశలలో సరఫరా చేయబడిన ఆహారం సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి ఆహార భద్రతా ప్రమాణాలపై తనిఖీ చేయడం చాలా అవసరం. అందుకే ప్రత్యేకంగా ఇందుకు గాను ఆహార భద్రతా దినోత్సవం జరుపుకుంటున్నారు.