suvichar
✕

రెండు అరటి పండ్లు తింటే ఎంత శక్తి వస్తుందో తెలుసా?

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదనేది ఇంగ్లీషులోని సామెత. కానీ అంతకంటే తక్కువ ధరలో, మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే అరటిపండు గురించి ఇప్పుడు కాస్త తెలుసుకుందాం.

Written By vasu
Updated: బుధవారం, 6 జూన్ 2018 (15:23 IST)
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదనేది ఇంగ్లీషులోని సామెత. కానీ అంతకంటే తక్కువ ధరలో, మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే అరటిపండు గురించి ఇప్పుడు కాస్త తెలుసుకుందాం.
 
1. అరటిపండ్లలో పుష్కలంగా లభించే బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటి నుండి లభించే పీచు పదార్థాల వల్ల మలబద్ధకం నుండి విముక్తి లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగై విరేచనం సాఫీగా జరగడంలో సహాయపడుతుంది.
 
2. రెండు అరటిపండ్లు 90 నిమిషాలపాటు వ్యాయామం చేయగలిగేంత శక్తినిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం రక్తపోటుని నివారిస్తుంది. ట్రిప్టాన్‌లనే ప్రొటీన్లు కొన్ని రసాయన చర్యల అనంతరం ఆనందాన్ని పెంచే సెరటోనిన్ హార్మోన్‍‌గా మారుతాయి. తద్వారా మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
 
3. టోక్యో యూనివర్సిటీ వారి పరిశోధనల ప్రకారం అరటిపండ్లలో ఉండే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్లు (టీఎన్ఎఫ్) క్యాన్సర్ కణాలతో సమర్ధంగా పోరాడి వాటిని నిర్మూలిస్తాయని తేలింది. అరటిపండు ఎంత పండితే ఈ క్యాన్సర్ నిరోధక గుణాలు అంతగా పెరుగుతాయట. అందులోనూ ఆకుపచ్చ అరటిపండ్ల కన్నా పసుపుపచ్చ రకం పండ్లలో పోషకాలు ఎనిమిది రెట్లు అధికంగా ఉంటాయట.
 
4. అరటిపండ్లు అధిక పిండి పదార్థాలకు మూలం. ఒక పండు ద్వారా సగటున 27 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభ్యమౌతాయి. జీర్ణమయ్యే వేగం కూడా తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఒక పండుతో సరిపెట్టుకుంటే మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోవలసి ఉంటుంది.

అన్నీ చూడండి

Stapede దుర్గామాత మండపంలో తొక్కిసలాట, 18 మంది మృతి

రాత్రి నూడుల్స్ తిన్నారు, తెల్లారేసరికి ఐదుగురు కుటుంబ సభ్యులు శవాలుగా మారారు

మా రాధా బాబుకే ఓటు, విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా గెలుపు ఖాయం

Gollapalli Reservoir: డ్యామ్‌లో మునిగి ఐదుగురు మహిళలు మృతి.. ఒకే కుటుంబానికి...?

అభిజీత్ దీప్కేకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

అన్నీ చూడండి

రౌడీ జనార్థన మూవీ నుంచి కీర్తి సురేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ (ఏయ్ జూడ్) హీరోగా కొత్త సినిమా

Nagavamsi: తెలుగునాట జైలర్ 2 ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

Dulquer Salmaanఫ ఆకాశంలో ఒక తార నుంచి రోలర్‌కోస్టర్ రైడ్‌ టీజర్ రిలీజ్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్‌ చిత్రం స్లమ్ డాగ్ షూటింగ్ పూర్తి.. త్వరలోనే రిలీజ్ డేట్

తర్వాతి కథనం
Show comments