సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (16:30 IST)

బిర్యానీ ఆకుతో మధుమేహానికి చెక్.. ఎలా?

బిర్యానీ తయారీలో మసాలా దినుసులతో పాటు.. బిర్యానీ ఆకును కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఈ బిర్యానీ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా మధుమేహం నియంత్రణలో ఉండానికి బిరియానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది.

బిర్యానీ తయారీలో మసాలా దినుసులతో పాటు.. బిర్యానీ ఆకును కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఈ బిర్యానీ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా మధుమేహం నియంత్రణలో ఉండానికి బిరియానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. మధుమేహుల్లో రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది.
 
అలాగే, కడుపులోని అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. ప్రతిరోజూ రాత్రి కొద్దిగా బేలీఫ్‌ ఎక్స్‌ట్రాని నీళ్లలో కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. బిరియానీ ఆకు వేసి మరిగించిన నీళ్లు తాగడం వల్ల రాళ్లు ఏర్పడటం, ఇతర కిడ్నీ సంబంధ వ్యాధులు రావు. దీనిలో కేన్సర్‌ నిరోధక కారకాలు ఉన్నాయి. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కేన్సర్‌ కారకాల ఉత్పత్తిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.