శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 28 ఏప్రియల్ 2018 (19:21 IST)

కంప్యూటర్ల ముందు ఉద్యోగం... ఎక్కడబడితే అక్కడ కొవ్వు... ఏం చేయాలి?

ఈరోజులలో చాలామంది ఉద్యోగాలలో బీజీగా ఉంటున్నారు. కనుక వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకునే సమయం దొరకటం లేదు. వీరు కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం ఉండటం లేదు. దీని కారణంగా శరీరంలో ఎక్కడపడితే అక్కడ కొవ్వు పేరుకుపోత

ఈరోజులలో చాలామంది ఉద్యోగాలలో బీజీగా ఉంటున్నారు. కనుక వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకునే సమయం దొరకటం లేదు. వీరు కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం ఉండటం లేదు. దీని కారణంగా శరీరంలో ఎక్కడపడితే అక్కడ కొవ్వు పేరుకుపోతుంది. 
 
ముఖ్యంగా పొట్ట, పిరుదలు, తొడలు, ముఖం ఈ భాగాలలో కొవ్వుశాతం ఎక్కువుగా ఉంటుంది. ముఖంలో కొవ్వు పేరుకుంటే ముఖం ఉబ్బుగా, వికారంగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు బాపూబొమ్మలాగా , అందంగా ఉండాలని కలలు కంటూ ఉంటారు. కనుక వీరు ముఖంలో పేరుకొనిన కొవ్వు తగ్గించుకోవటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సిందే. అవి ఏమిటో చూద్దాం...
 
1. మనం తీసుకునే ఆహారంలో కెలోరీలు లేకుండా చూసుకోవాలి. రోజుకి 2 గ్రాములకు మించి ఉప్పు తినకూడదు. 
 
2. క్యాల్షియం, ప్రోటీన్స్ ఎక్కువుగా ఉన్న ఆహారం తినాలి. ఈ క్యాల్షియం ముఖంలో అదనంగా ఉన్న నీటిని బయటకు పంపించి ముఖం పలుచగా ఉండేలా చేస్తుంది. కనుక రోజుకి 4 లీటర్ల నీటిని త్రాగటం మంచిది.
 
3. మునివేళ్లతో చెంపల అడుగు నుంచి పైకి చర్మాన్ని లిప్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం సాగినట్టుగా ఉండదు. వీటితో పాటు కళ్లను గుండ్రంగా తిప్పడం, నాలుకని వీలైనంత బయటకు తీయడం వంటివి కూడా ముఖంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి.
 
4. రోజు బుడగలను ఊది దానిలోని గాలిని వదిలేస్తూ ఉండాలి. ఇలా ఐదారుసార్లు చేయడం వల్ల బుగ్గలకు మంచి నిగారింపు వచ్చి ముఖంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది.
 
5. రేగు ఆకుల్ని మెత్తగా దంచి గ్లాసుడు నీటిలో రాత్రిపూట నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం త్రాగటం వల్ల ముఖంలో పేరుకున్న అదనపు కొవ్వు తొలగిపోతుంది.
 
6. ముడి నువ్వుల నూనెను 2 టీ స్పూన్ల చొప్పున తీసుకొని రోజు పుక్కిలించుట వలన మంచి ఫలితం ఉంటుంది.