శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (18:57 IST)

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. బాదం, బ్లూబెర్రీస్ తీసుకోండి!

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. న్యూట్రీషియన్స్, విటమిన్స్ పుష్కలంగా కలిగివుండే ఆహారాన్ని తీసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచడంతో పాటు మెదడును తాజాగా ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారంలో న్యూట్రీషన్స్ ఉండేలా చేసుకోవాలి. 
 
ముఖ్యంగా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి పాలు తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమయ్యే ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి. పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. 
 
అలాగే బాదంలో ఉండే అద్బుతమైన జింక్ ఖనిజం, విటమిన్ బి12 వల్ల ఒత్తిడి దూరమవుతుంది. బాదంలోని పోషకాలు మనస్సును సమతుల్యంగా ఉంచి ఆందోళనను దూరం చేస్తుంది.
 
ఇంకా బ్లూబెర్రీస్ కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో ఉన్న విటమిన్ సి ఒత్తిడితో పోరాడే ఔషధ గుణాలు అధికంగా ఉన్నందువల్ల, ఒత్తిడిని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తంలోని షుగర్ లెవల్‌ను నియంత్రిస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు.